Suryaa.co.in

Features

మన తరానికి ఆదర్శ పురుషుడు సర్దార్ సర్వాయి పాపన్న

రాజంటే రాజురా
రాజులకే రాజురా
భారత మాత కన్న
మనసున్న మహారాజురా
సర్దార్ సర్వాయి పాపన్న రా

పీడిత ప్రజల విముక్తి కోసం
తెలుగు నేలపై వెలిగిన
మరో సూర్యుడు మహావీరుడు
దొర లనే మానవ మృగాలను
వేటాడిన మహాసేయుడు
మన తరానికి ఆదర్శ పురుషుడు

“రాజంటే రాజురా”

ప్రతి మనిషిని సైనికుడిగా మలచి
దుస్టుల తలలు తుంచి
మొగలుల మెడలు వంచి
పేదల కడుపు నింపిన
కరుణామయుడు,
కలియుగ కర్ణుడు

“రాజంటే రాజురా”

సైన్యాన్ని స్థాపించి
కోటలను కట్టించి
రాజ్యాన్ని నిర్మించి
సమ సమాజ నిర్మాణం సాగించాడు
ప్రజల హృదయాలను గెలిచి
ధ్రువ తారై నిలిచాడు

జోహార్ జోహార్ పాపన్న
జోహార్ జోహార్ పాపన్న

నువు కలలు కన్న సమ సమాజం
సాధించే సమరంలో
ప్రతి మనిషి ఒక అగ్గిపిడుగై
ప్రాణార్పణ చేస్తాం
ప్రాణార్పణ చేస్తాం

రాజంటే రాజురా
రాజులకే రాజురా
భారత మాత కన్న
మనసున్న మహారాజురా
సర్దార్ సర్వాయి పాపన్న రా

-నారగొని,ప్రవీణ్ కుమాసర్

LEAVE A RESPONSE