– జగన్ హయంలో విద్యావ్యవస్థ మెరుగుపడింది.
– మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా ఉపసంహరించుకోవాలి
– మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు
విజయవాడ:ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మాజీ శాసనసభ్యులు, సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మల్లాది విష్ణు తెలిపారు. ఆంధ్రప్రభ కాలనీ లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం నందు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమము నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. నగరంలోని ఉపాధ్యాయులను ఆయన సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని, ఆయన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు.
నాలుగు దశాబ్దాల పాటు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారనీ చెప్పారు.ఆయన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా రష్యాకు, భారతదేశానికి, రాయబారిగా పనిచేసిన వ్యక్తి అని ఆయన అన్నారు.ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఏటా దేశమంతటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
ఈ సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉపాధ్యాయులంటే తక్కువ చేసి చూపెడుతున్నారని చెప్పారు. ఈ సమాజానికి మార్గదర్శకులు, ఈ సమాజాన్ని దిక్సూచి లాగా ఉండే వ్యక్తులు ఉపాధ్యాయులు అని అన్నారు. ఈ సమాజంలో అనేక మందిని ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దిన వ్యక్తులు ఉపాధ్యాయులని ఆయన వివరించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 5సంవత్చరాలుగా ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలని, విద్యతోనే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని, విద్యతోనే ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చనీ, విద్య ద్వారానే కుటుంబంలో గౌరవం సంపాదించవచ్చనీ, ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విష్ణు కొనియాడారు.
మా ప్రభుత్వ హయాంలో 75 వేల కోట్ల రూపాయలు విద్యారంగం మీద ఖర్చు పెట్టామని తెలియజేశారు. ఒక ప్రణాళిక బద్ధంగా పాఠశాలలో విద్యా విధానంలో గాని, కరికులం లో గానీ, పాఠశాల లలో నాడు-నేడు లో , అమ్మ ఒడిని తీసుకురావడంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరవడిని సృష్టించారని తెలిపారు. అందరూ కూడా చదువుకోవాలని ఉద్దేశ్యంతోనే అమ్మవడిని రూపొందించారని చెప్పారు. రాష్ట్రంలో బాల కార్మికులు లేకుండా ఉండటానికి, ప్రతి గ్రామంలో విద్యార్థులకు విద్యను అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని చెప్పారు.
అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని చెప్పారు. విద్య పట్ల అవగాహన ఉండి అందరూ చదువుకోవాలని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం తల్లికి వందనం అని పేరు మార్చి ఒక సంవత్సరం కాలం మొత్తం పూర్తిగా ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి విద్యా సంవత్సరంలో జగనన్న విద్య కానుక అని ప్రవేశపెట్టి విద్యార్థులందరికీ పుస్తకాలను, యూనిఫార్మ్స్ ను, షూస్ ను, మౌలిక సదుపాయాలను విద్యారంగం ప్రారంభంలోనే ఇచ్చేవారని గుర్తుచేశారు. ఇంటర్మీడియట్ నుంచి విద్యాదీవెన, వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్లు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు కార్పోరేట్ విద్యను అందించాలని మాతృభాషతో పాటు ఆంగ్ల భాషను కూడా ప్రవేశపెట్టారని చెప్పారు.
ఈ ప్రభుత్వంలో కేబినెట్ మీటింగ్ లో మెడికల్ కాలేజీలన్ని కూడా ప్రైవేటుపరం చేయాలని అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని ఆయన
మండిపడ్డారు. జగన్ హయంలో ఏ రాష్ట్రానికి లేని మెడికల్ కాలేజీలను కేంద్రంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చారని చెప్పారు. ఆ మెడికల్ కాలేజీ లన్నీ ప్రారంభమయ్యే దశలో ఉంటే అవన్నీ ఇప్పుడు ప్రైవేటుపరం చేసేయాలని ఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
వాళ్లకు కావాల్సింది వాళ్ళ వ్యక్తుల సంపదను సృష్టించడానికి మాత్రమేనని, అందుకే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెంటనే చంద్రబాబు నిలుపుదల చెయ్యాలని క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ విద్యా, వైద్యం అందించాలని, ప్రతి ఒక్కరు చదువుకోవాలని ప్రతి ఒక్కరికి వైద్యం తక్కువ ధరకే రావాలని ఆయన కోరారు.
తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా ఉప సంహరించుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు టీచింగ్ కాకుండా నాన్ టీచింగ్ పనులను చేపిస్తున్నారని దీనివల్ల పని భారం పెరగటం వల్ల విద్యా బోధనలో వెనకబడిపోతున్నారని చెప్పారు.
డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ రెడ్డి మాట్లాడుతూ, విద్యాబోధనలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సేవలు అనిర్వచనీయమని ఆమె ప్రశంసించారు. సర్వేపల్లి రాధాకృష్ణ బాటలోనే జగన్మోహన్ రెడ్డి హయంలో విద్యా సంస్థలో అనేక సంస్కరనలు తీసుకువచ్చారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కార్పొరేటర్లు సర్వాణి మూర్తి, అలంపూర్ విజయ్, కుక్కల రమేష్, ఎర్ర గొల్ల శ్రీరాములు, రాజా రమేష్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి త్రివేణి రెడ్డి, కార్యదర్శి ఝాన్సీ రాణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి, నియోజకవర్గ నాయకులు చంద్రమౌళి, దోనేపూడి శ్రీనివాస్, తోపుల వరలక్ష్మి, పిల్లుట్ల వంశీ, కాళ్ల ఆదినారాయణ, భోగాది మురళి, కంభం కొండలరావు తదితరులు పాల్గొన్నారు.