మంగళగిరి: తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మల్యాద్రి, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్, ఏపీ లీడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ కుప్పం రాజశేఖర్, టీడీపీ ఎన్నారై విభాగం చప్పిడి రాజశేఖర్ తదితరులు పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియడారు.
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ మల్యాద్రి మాట్లాడుతూ.. విద్య రంగంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విశేష కృషి చేసినట్టు పేర్కొన్నారు. భారతీయ తత్వశాస్త్రానికి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని తెలిపారు. ఆయన ఆదర్శాలతో మన రాష్ట్రంలో విద్య వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు దార్శిక దృష్టితో నారా లోకేష్ సమర్థవంతమైన నాయకత్వంలో విద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని తెలిపారు.