– సీఎంపై రాయి కేసు
– సతీష్‌కు 14 రోజులు రిమాండ్
– నెల్లూరు జైలుకు తరలింపు
విజయవాడ: సీఎం జగన్‌పై రాయి విసిరిన సతీష్ అనే యువకుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్‌కు మే 2 వరకూ రిమాండ్ విధించి, అతడిని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో ఐదుగురు యువకులను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.