విశాఖపట్నం: దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఇటీవల కమిషనరుగా నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విశాఖకు వచ్చి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు.
రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలంలో జరిగే చందనోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. ఆలయాలలో అమలులో ఉన్న ఆగమ విధానాలను సమీక్షించాలని, ధార్మిక సలహా మండలి సమావేశాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేయాలని తెలిపారు.