జీవన సౌందర్యం కానరాని ఆదివాసీయులనూ చూశారు. ప్రాణమిత్రులు సుభానీ ఆహ్వానం మేరకు రెండ్రోజులు చత్తీస్ ఘడ్, ఒరిస్సా బోర్డర్లోని ఆదివాసీ అటవీ ప్రాంతానికి వెళ్లాను.ఏపీ హద్దులు దాటి, తెలంగాణ సరిహద్దులు దాటి, తెలుగు భాష తెలియని కోయ,గుత్తి కోయల, లంబాడి, ఆదివాసీ గిరిజన తండాలకు, గూడాలకు వెళ్లాను.
చింతూరు, మొండి, చట్టి, నాలుగుర్రాళ్ళ పాలెం,దుబ్బ గూడెం ఇలా… చాలా గ్రామాలను, ఆఖరికి ఒరిస్సా లోని ఒక చోట నక్సల్స్ వేటకు కోసం ఏర్పాటుచేసిన బేస్ క్యాంప్ చూశాను.పోలీసుల కాల్పుల్లో అసువులు బాసిన నక్సల్స్ అమరవీరుల విగ్రహాలను, నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన పోలీసుల, సలాజం ఫోర్స్ కార్యకర్తల విగ్రహాలు ఉన్న గ్రామాలు కనిపించాయి.
ఒకరు వ్యవస్థ అణచివేతపై యుద్ధం చేసి మరణిస్తే, మరొకరు అణచివేతలపై తిరగబడ్డ వారిని అంతం చేసి మరణించారు. ఈ భిన్న కోణం … వ్యవస్థలోని ప్రభుత్వాల తీరుకు, పాలకుల కుట్రలకు సాక్ష్యం చెప్తున్నట్టు అనిపించాయి.
గజానికో చెట్టు, తల పైకెత్తి చూసే ఎత్తు ….ఐనా వాటి ఆకుల్లో పచ్చదనం తక్కువ.పది కుటుంబాలో, ఇరవై కుటుంబాలో కలిసి బతుకుతున్న వారందరిలో ….నాగరిక ప్రపంచం గొప్పగా చెప్పుకునే జీవన సౌందర్యం నాకెక్కడా మచ్చుకు కూడా కనిపించలేదు.కుడి చేయి పట్టుకొని నడిచే బిడ్డ, చంకలో రెండో బిడ్డ, కడుపులో మూడో బిడ్డ ….. నెత్తిన నీళ్ళ కుండ..వయస్సు 20లోపే.<a href=”https://ibb.co/DDcVNWG”></a>
<a href=”https://ibb.co/Rp0CKWm”><img src=”” alt=”imgonline-com-ua-resize-PFWTI0ul7-Nz-CYWq-J” border=”0″></a>
ఒసేయ్ రాములమ్మ వారసుల్లా కదల లేక కదులుతున్న ఆట బొమ్మలు. రెండు, మూడు చోట్ల రహదారిపై తాడు అడ్డం పెట్టి నా కారు ఆపారు.భూమి పూజ పండుగ అంటూ అన్నా..పది రూపాయలంటూ అడిగారు.20 రూపాయలు ఇస్తే.. వద్దన్నారు. ₹10 చాలన్నారు.ఎంత చెప్పినా తీసుకో లేదు.డబ్బలున్నోళ్ళ ముఖంపై ఖాండ్రించి ఉమ్మేసి నట్టుగా అనిపించింది.
మనకు మాత్రమే తెలిసిన లక్షలు, కోట్లు వారికి తెలియవేమొ..అనీ అనిపించిందిబతుకు తెరువు వార్ తప్ప.
ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలను విభజిస్తూ వెళుతున్న శబరి నది తీరంలో … కాసేపు సేద తీరాను.ఒక సత్యాన్ని ప్రపంచానికి చెప్పకపోతే ముద్ద దిగదేమొ అనే బెంగతో ..బయటికి చెప్పేస్తే అభయం ఉంటుందేమో అనే ఆశతో ….
ఈ రెండు మాటలను చెప్పాలని….