-దళిత హంతకుల పార్టీకి బుద్ధి చెప్పండి
-సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించారు
-వైసీపీ రద్దు చేసిన 27 పథకాలు పునరుద్ధరిస్తాం
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ చంద్రబాబుతోనే సాధ్యమని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదికలో నియోజకవర్గ స్థాయి మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ పాల్గొన్నారు. ముందుగా అంబే ద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నా మాట్లాడుతూ వైసీపీ రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలు తిరిగి మరలా ప్రవేశపెడతామని తెలిపారు. వైసీపీని ఓడిరచి అమరావతిని తిరిగి నిర్మించుకునేలా అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మాదిగల జెండా అజెండా ఒకటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమేనన్నారు. మాదిగల పంతం ఒక్కటే జగన్ అంతం అని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో దళితులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. దళితు లను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. అంబేద్కర్ పేరును విదేశీ విద్యకి తొలగించి ఆయన పేరు పెట్టుకోవటం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నవరత్నాలకు మళ్లించిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు. లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ దళితులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. వారి నిధులు దారి మళ్లించారు. రాజధానితో వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయేలా చేశారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అన్ని పథకాలు అమలు చేస్తామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను, కన్నా లక్ష్మీనారాయణను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు