Suryaa.co.in

Andhra Pradesh International

ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో గల్ఫ్‌ టీడీపీ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఎన్నారై నాయకులు కే శేషుబాబు, కోడూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని వారు అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలు ఆశించిన విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నారై టీడీపీ నాయకులు కే బుచ్చిరామ్‌ప్రసాద్‌, చలసాని కిషోర్, అరవింద్ వేమూరి, కాట్రగడ్డనాని, షేక్ నాగుల్ మీరా, బాల కృష్ణ, సుధాకర్, అనిల్,పాల్గొన్నారు.

LEAVE A RESPONSE