Suryaa.co.in

Andhra Pradesh

పోలవరంపై సుప్రీంకోర్టు సీరియస్

-వాస్తవాలు నివేదించాలని కేంద్రానికి ఆదేశం
-డిసెంబర్ 7కు వాయిదా..

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై వాస్తవాలను నివేదించాలని కేంద్ర జల వనరుల శాఖను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ ప్రాంతాలు ముంపుకు గురైతాయని చత్తీస్గడ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం అన్నింటిని ఒకేసారి ఒకే బెంచ్ లో విచారించాలని నిర్ణయించింది.

అందుకే కేంద్ర జలవనుల శాఖ వాస్తవ నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ కేసును డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి పోలవరం నిర్మాణం చేపట్టినట్లు పిటిషనర్లు పేర్కొనడంతో సుప్రీంకోర్టు ఈ అంశంపై ముఖ్యమంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చలు జరపాలని, రాష్ట్రాల అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం దేవాలయం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్ కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. ఇతర రాష్ట్రాలు తెలిపిన అభ్యంతరాలను పరిశీలించి తగిన విధంగా సమస్యను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా సర్వోత్త న్యాయస్థానం నిర్ణయించింది.

LEAVE A RESPONSE