Suryaa.co.in

Telangana

అర్హులందరికీ పథకాలు: డిప్యూటీ స్పీకర్ పద్మారావు

ఉపసభాపతి పద్మారావు తార్నాక డివిజన్ పరిధిలో రూ. 11 లక్షలకు పైగా విలువ చేసే 13 కళ్యాణ లక్ష్మి, షాదిముబారాక్ , సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందచేశారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, నేతలు మోతే శోభన్ రెడ్డి , రామేశ్వర్ తదితరులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ చెక్కులను అందించారు. ప్రభుత్వ పధకాలను నేరుగా ప్రజలకు అందించేందుకే నేరుగా లబ్దిదారుల ఇళ్ళకు వెళుతున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు cmrf ను సద్వినియోగం చేసుకుంటున్నామని పద్మారావు పేర్కొన్నారు. అర్హులకు రేషన్ కార్డులను అందిస్తామని తెలిపారు.

– షాది ముబరాక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పధకాల లబ్దిదారులు ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ కార్యాలయం నెంబరు 040-27504448 కు ఫిర్యాదు చేయవచ్చునని ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. కళ్యాణ లక్ష్మి, శాదిముబారక్(2015 నుంచి మొత్తం) — 4404 — Rs. 39 కోట్లు
CMRF నిధులు (తెలంగాణా రాష్ట్రంలోనే ప్రధమం) 3040 — Rs.28 కోట్లు
పెన్షన్లు (2019 మార్చి 31 నాటికి)
(మొత్తం 15,444) ప్రతినెలా Rs.3.36 కోట్లు.. Rs. 40.30 కోట్లు

LEAVE A RESPONSE