Suryaa.co.in

National

మహారాష్ట్రలో సెక్యూలరిజం భలే భలే!

– “ఇండి కూటమి” కి ఆల్ ఇండియా ఉలేమా బోర్డు’ డిమాండ్స్
(చాడా శాస్త్రి)

మహారాష్ట్ర లో ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో “ఇండి కూటమి” అభ్యర్థులకు తమ మద్దతు తెలపడానికి, కూటమి అభ్యర్థులకు ప్రచారం చేయడానికి ‘ఆల్ ఇండియా ఉలేమా బోర్డు’ మహా వికాస్ అఘాది కూటమి అంటే కాంగ్రెస్+శరద్ పవర్ ఎన్సీపీ+ఉద్ధవ థాక్రే శివసేన కూటమికి 17 డిమాండ్స్ పెట్టింది.

అవి ఏమిటంటే..

1. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడం, ముస్లింలకు విద్యాలయాల్లోనూ, ఉద్యోగాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పించాలి.
2. మహారాష్ట్రలోని 48 జిల్లాల్లో కబ్జాకు గురైన మసీదులు, శ్మశానవాటికలు, దర్గాల భూములను కమిషనర్ ద్వారా సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేయాలి.
3. మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు అభివృద్ధికి రూ.1000 కోట్లు నిధులు ఇవ్వాలి.
4. 2012 నుంచి 2024 వరకు అల్లర్లను వ్యాప్తి చేశారనే ఆరోపణలపై జైలులో ఉన్న అమాయక ముస్లింలను విడుదల చేయాలి.
5. మౌలానా సల్మాన్ అజారీని జైలు నుంచి బయటకు తీసుకురావాలని 30 మంది మహా వికాస్ అగాదీ ఎంపీలు ప్రధాని మోదీకి లేఖలు రాయాలి.
6. ఇండి కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహారాష్ట్రలోని మసీదుల ఇమామ్‌లు, మౌలానాలకు ప్రతినెలా రూ.15వేలు ఇస్తామని హామీ ఇవాలి.
7. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ముస్లిం యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
8.మహారాష్ట్రలోని విద్యావంతులైన ముస్లిం సమాజానికి పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి.
9. రామగిరి మహారాజ్‌, నితీష్‌ రాణేలను జైల్లో పెట్టకపోవడాన్ని ఇండి కూటమి గట్టి నిరసన తెలపాలి.
10. మహారాష్ట్రలో ఇండి అలయన్స్ మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆల్ ఇండియా ఉలమా బోర్డు ముఫ్తీ మౌలానా, అలీమ్ హఫీజ్ మసీదు ఇమామ్‌లను ప్రభుత్వ కమిటీలో చేర్చాలి.
11. మహారాష్ట్ర అసెంబ్లీలో 2024 ఎన్నికల్లో ముస్లిం వర్గానికి చెందిన 50 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలి.
12. మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహారాష్ట్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 500 మంది ఉద్యోగులను నియమించాలి.
13. మహారాష్ట్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆస్తులపై ఆక్రమణలను తొలగించేందుకు మహారాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలి.
14. మా ప్రవక్త ముహమ్మద్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులపై చట్టపరమైన ఆంక్షలు విధించేలా చట్టం చేయాలి.
15. ఇండి కూటమి భాగస్వాములు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు RSS ని నిషేధించాలి.
16. మహారాష్ట్రలోని 48 జిల్లాల్లో ఆల్ ఇండియా ఉలేమా బోర్డు పనిచేస్తోంది. ఈ ప్రకటనలో పేర్కొన్న డిమాండ్‌ను ఆమోదించడానికి, నానా పటోలే, ఉద్ధవ్‌జీ థాకరే మరియు శరద్ పవార్ కి చెందిన ఇండియా అలయన్స్ హామీ పత్రాన్ని ఇవ్వాలి.
17. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఇండి కూటమికి ప్రచారం చేయడానికి 48 జిల్లాల్లోని ఆల్ ఇండియా ఉలేమా బోర్డుకు అవసరమైన ఏర్పాట్లు, సహాయం అందించాలి.
దీనిపై ‘మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ’ సానుకూలంగా స్పందించి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ డిమాండ్స్ అన్నిటినీ నెరవేరుస్తామని లెటర్ ద్వారా ఉలేమా బోర్డ్ కి తెలియచేసింది.
మహారాష్ట్రలో సెక్యూలరిజం బలపరచడానికి.. సెక్యూలర్ కాంగ్రెస్ ఆ విధంగా ముందుకు పోవడానికి నిర్ణయించింది అన్న మాట.

LEAVE A RESPONSE