– మూసీ నిద్ర కార్యక్రమం ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్: నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసం ఉంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. బుల్డోజర్ కి అడ్డం వచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదూ, పేదప్రజల ఇండ్లు కూల్చడమే మా లక్ష్యం అన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. గత నాలుగు నెలలుగా భారతీయ జనతా పార్టీ తరఫున బాధిత ప్రజలకు భరోసా కల్పించాం, ధర్నా చౌక్ లో ధర్నాలు చేసాం.
ఈరోజు బాధిత ప్రజలతో కలిసి వాళ్ల నివాసాల్లో నిద్ర చేసే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రకటనలతో ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి మాఇళ్లు కూలగొడ్తుందోనన్న భయంతో ప్రజలు అనారోగ్యాని గురైతున్నారు. ఒక జాతీయ పార్టీగా, పేద ప్రజల కోసం పని చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందనే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
పేద ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు. గండిపేట్ నుండి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. మూసీ సుందరీకరణ ఉద్దేశ్యం ఏంటి? ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది, నిధులు ఎక్కడ నుండి తీసుకొస్తున్నరు, లక్షా యాభై వేల కోట్లు అవసరమా?
కేవలం పేదప్రజల ఇండ్లు కూలగొట్లే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. బుల్డోజర్ కి అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం.