Suryaa.co.in

Political News

సెక్యులర్లు పొంచి ఉన్నారు..తస్మాత్ జాగ్రత్త!

– SP కి పెరిగిన ఓటు బ్యాంకు ముస్లిం సామాజిక వర్గానిదే

సోషల్ మీడియాలో యుపి ముస్లింల గురించి అభివృద్ధికి ఓటు వేసారని పుకార్లు నడుస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఓట్ పర్సంటేజ్ లను గమనిస్తే, 2017 లో సమాజ్ వాదీ పార్టీ ఓట్ షేర్ 22.8%, 2022 లో 32% ..2017 లో SP అభ్యర్థులకు భయపడి ఓట్లేసిన దళిత- బ్రాహ్మణులకు యోగి కల్పించిన రక్షణ నమ్మకం వల్ల, దళిత ఓటు బ్యాంకు మాయావతికి కాకుండా, బిజెపి ని బలపరిచింది.

అలాగే బ్రాహ్మణులు ఇతర సామాజిక వర్గం, 2017 కు ముందు సమాజ్ వాదీ పార్టీ హయాంలో పీడింప పడ్డవారు, బాధితులు ఎక్కువ హిందూ సమాజం 2022లో యోగి చెంతకు చేరారు.అంటే ఇప్పుడు హిందువుల ఓట్ బ్యాంకు బిజెపి కి సపోర్ట్ చేయగా, SP కి పెరిగిన ఓటు బ్యాంకు లేదా ‌బలపరచిన ఓటు బ్యాంకు మొత్తం ముస్లిం సామాజిక వర్గానిదే.

MIMకు ఒక్క సీటు కూడా ఇయ్యలేదంటే వాళ్ళ ఓటు బ్యాంకు చీలకుండా ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారనేది అర్థం చేసుకోవాలి. MIM కు వేస్తే మహా అయితే ఓ 10 సీట్లు వస్తాయేమో..కానీ వాళ్ళకు UP మీద పెత్తనం కావాలి.2017 కు ముందు వున్న UP కావాలి. బిజెపి హయాం లో ప్రజల్లో పోయిన భయం కావాలి.

ఇప్పుడు బిజెపి కి 57 సీట్లు తగ్గినయి. అదే ఓడిపోయుంటే అనర్థాలు భయంకరంగా వుండేవి. ముస్లింలు అధికంగా వుండే కైరానా నుండి 71 అసెంబ్లీ స్థానాలు ఉండగా, బిజెపికి 67 స్థానాల్లో ‌చాలా తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.అక్కడి SP అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. 2017లో అక్కడినుంచి బిజెపి 47
akhilesh-muslimgroups స్థానాలు గెలుపొందింది.ఇంకో విషయం ఏంటంటే కైరానా నుండి జిహాద్ హసన్, జైలు నుండే పోటీ చేసి గెలిచాడు.అలాగే రామ్పూర్ నుండి ఆజమ్ ఖాన్ కూడా జైలు నుండే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాడు. ముస్లింల మీద అనవసర సానుభూతి మంచిది కాదు.సెక్యులర్ లు పొంచి ఉన్నారు.
( ఈ వ్యాసంలోని అంశాలు రచయిత వ్యక్తిగతమైనవి)

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు

LEAVE A RESPONSE