• ఆదరణ–3 పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై కసరత్తు
• రాష్ట్రవ్యాప్తంగా బీసీ భవనాల నిర్మాణం చేస్తాం
• డీఎస్సీ అభ్యర్థుల కోసం జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు
– బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ ల మంత్రి ఎస్.సవిత
– బీసీ సంక్షేమ భవన్ లో బీసీ కార్పొరేషన్ చైర్మన్ల తో మంత్రి భేటీ
విజయవాడ: బీసీల రక్షణ చట్టంతోనే బీసీలకు భద్రత, ఆత్మరక్షణ సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ ల మంత్రి ఎస్.సవిత అన్నారు. స్థానిక గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ లో బీసీ కార్పొరేషన్ చైర్మన్ల తో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ ల మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ.. బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో భేటీలో మంత్రి స్పష్టం చేశారు.
బీసీల రక్షణ చట్టం అమలుపై చర్చించడంతోపాటు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం బీసీలకు అండగా నిలవడం, గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆదరణ 1, 2′ పథకాల తరహాలోనే, ఇప్పుడు ‘ఆదరణ-3’ ను ఏ విధంగా సమర్థవంతంగా అమలు చేయాలనే అంశంపై 39 మంది కార్పొరేషన్ ఛైర్మన్లతో చర్చించామన్నారు.
బీసీలకు 34% రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ల కల్పనపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ భవన్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద బీసీలకు 20,000 రూపాయల అదనపు సబ్సిడీ అందించడ జరుగుతుందన్నారు. ప్రతి బీసీ బిడ్డను ఎంట్రప్రెన్యూర్ (entrepreneur) గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రతి జిల్లాలో కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, ఇప్పటికే 300 మంది విద్యార్థులు దీని ద్వారా ఎంపిక కావడం విశేషమన్నారు. ‘లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ’ ద్వారా బీసీ విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో అత్యుత్తమ శిక్షణ సివిల్స్ లో అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నాయకత్వంలో బీసీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మంత్రి సవిత పునరుద్ఘాటించారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లిఖార్జున్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనంత కుమారి, తదితరులు పాల్గొన్నారు.