తిరుమల GNC చెకింగ్ టోల్ గేట్ సెక్యూరిటీ పాయింట్ దాటి ఆలిపిరి డౌన్ చెకింగ్ పాయింట్ ద్వారా, టిటిడి ఎలక్ట్రికల్ జిపిఎస్ బస్ ను గుర్తు తెలియని వ్యక్తి వెంకటగిరి మార్గం వరకు ఎలా తీసుకువెళ్లాడు?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిమంది శ్రీవారి భక్తులకు సమానంగా, కొండపైన పోలీస్,విజిలెన్స్,ఎస్ పి జి, ఆక్టోపస్ లాంటి ఇతర అనేక నిఘా వ్యవస్థలు ఉన్నా… టిటిడి బస్సు ను దర్జాగా కొండ నుంచి వెంకటగిరి మార్గం వరకు తీసుకెళ్లాడు. అంటే టిటిడి నిఘా వ్యవస్థ వైపల్యం కాదా?
టీటీడీ ఎలక్ట్రికల్ బస్ బ్యాటరీ ఛార్జింగ్ కొండ వరకు మాత్రమే వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి వెంకటగిరి మార్గంలో బస్ నిలిచిపోతే, GPS ద్వారా అధికారులు కనుక్కున్నారా అన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయన్నారు!
తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో భక్తులు, స్థానికులు టీటీడీ అధికారులను పదేపదే హెచ్చరిస్తున్నా “చెవిటి వాడికి శంఖం ఊదినట్లు” వ్యవహరించడం.. “చేతులు కాలాక ఆకులు పట్టుకున్న” చందంగా వ్యవహరించడం బాధ్యతారాహిత్యం కాదా?
తిరుమల శ్రీవారి ఆలయం పై “డ్రోన్ కెమెరా” చెక్కర్లు కొట్టినప్పుడు,ఆనంద నిలయం పై “విమాన” రాకపోకలు కొనసాగిస్తున్నప్పుడు భక్తులు, మీడియా హెచ్చరిస్తున్నా”నిమ్మకు నీరు ఎత్తినట్లు” వ్యవహరించడంతో వరుస సంఘటనలు జరుగుతున్నాయి !
తిరుమల కొండ పై రాజకీయ పలుకుబడితో, డిప్యూటేషన్ పై దీర్ఘకాలికంగా తిష్ట వేసి పనిచేస్తున్న వివిధ శాఖలలోని కొంతమంది అధికారులు, శ్రీవారి ఆలయ భద్రత గాలికి వదిలి తమ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమై పోయారు!
టీటీడీలో దీర్ఘకాలికంగా డిప్యూటేషన్ పై పనిచేస్తున్న అన్ని శాఖలోని అధికారులను సాగనంపండి.
“టీటీడీ కి రెగ్యులర్ IAS ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించండి”
హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆలయ పవిత్రతను భక్తుల మనోభావాలను కాపాడాలని శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను!
టిటిడి వాహనాలకు ఏర్పాటు చేసిన “జిపిఎస్” (గ్లోబల్ ప్రాసెసింగ్ సిస్టం) వ్యవస్థ పనిచేస్తుంటే, ఇటీవల ఎలక్ట్రికల్ కార్.. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రికల్ బస్సు కొండ నుంచి మిస్ అవ్వడం భక్తులకు ఆందోళన కలిగిస్తుంది.
తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో మఠాధిపతులు పీఠాధిపతులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (CISF) ను ఏర్పాటు చేయించాలని భక్తునిగా డిమాండ్ చేస్తున్నా.
“గోవిందా నీకు నీవే దిక్కు
మాకు నీవే దిక్కు “గోవిందా