-భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రకు భద్రతకై 21న డీజీపీకి మెయిల్ చేస్తే, యాత్ర గురించి సమాచారం లేదనడం శోచనీయం
– అధర్మంగా తన భర్తను అరెస్టు చేసినందుకే ఈ నిజం గెలవాలి యాత్ర
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
భువనేశ్వరి గారి ‘నిజం గెలవాలి’ యాత్రకు భద్రతకై 21న డీజీపీకి మెయిల్ చేస్తే, యాత్ర గురించి సమాచారం లేదనడం శోచనీయమని, నారా భువనేశ్వరి గారి ‘నిజం గెలవాలి’ యాత్రకు భద్రత కల్పించాలని, అధర్మంగా తన భర్తను అరెస్టు చేసినందుకే ఈ నిజం గెలవాలి యాత్ర అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ…
డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల అబద్ధాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు . ఆయన అభద్రతా భావంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్ అంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎందుకంత భయమో అర్థం కావడంలేదు.
నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అని యాత్ర నిర్వహిస్తున్నట్లు, భద్రత కావాలని అక్టోబర్ 21 వ తేదీన లెటర్ మెయిల్ చేశాను. నేను ఆయనకు 21న నేను మెయిల్ చేస్తే, ఆయన 23వ తేదీన నాకు ఆమె యాత్ర గురించి సమాచారం లేదని చెప్పడం శోచనీయం. రాజేంద్రనాథ్ రెడ్డికి వచ్చే మెయిల్స్ తనే స్వయంగా చూస్తారా? లేక సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తారా?
జగన్, సజ్జల గార్ల చేతుల్లో డీజీపీ ఆటబొమ్మగా మారారా?
జగన్, సజ్జల గార్ల చేతుల్లో డీజీపీ ఆటబొమ్మగా మారారా?అనే అనుమానం కలుగుతోంది. భువనేశ్వరిగారి యాత్ర ఉన్నట్లు అక్టోబర్ 21 వ తేదీన మెయిల్ పంపినప్పటికి నోటీసుకు రాలేదు, నాకు తెలియదు, మమ్మల్ని ఎవరూ సెక్యూరిటీ అడగలేదనడం పచ్చి అబద్ధం. మళ్లీ ఇంకో లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్ తోనైనా భద్రత కల్పించాలి.భువనేశ్వరి ఏరోజూ బయటికి రాని సాద్వి. ఆమె తన భర్తకు అన్యాయం జరిగడంతో బయటికి వచ్చారు. చంద్రబాబుపై తప్పుడు కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడంతో భాధపడి ఆమె బయటికి వచ్చారు. నిజాన్ని గెలిపించండని కోరుతూ భువనేశ్వరి బయటికి వస్తున్నారు. నిజాన్ని గెలిపించాలనే సంకల్పంతో ఆమె ఈ యాత్రకు పూనుకున్నారు. సెక్యూరిటీ అరెంజ్ మెంట్ ఏర్పాటు చేయండని మరోసారి కోరుతున్నాను.
రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
మానవ హక్కుల ఉల్లంఘనలో మన రాష్ట్రం బీహార్ ను మించిపోయింది. రాష్ట్రంలో మానవ హక్కులకు అడుగడుగునా భంగం కలుగుతోంది. మానవ హక్కుల్ని జగన్ ప్రభుత్వం కాలరాస్తోంది. రాష్ట్రంలో మానవ హక్కులు రాష్ట్రంలో లేవు. రాజ్యంగం ఇక్కడ ధిక్కరించబడింది. రాజ్యాంగ పరంగా పౌరులకు రావాల్సిన హక్కుల్ని ఈ జగన్ ప్రభుత్వం పాదాల కింద అణచివేస్తోంది.
అందుకే రాష్ట్రంలో ఎక్కడెక్కడ మానవ హక్కులకు భంగం కలిగిందో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ అరుణ్ మిశ్రా కి టీడీపీ ఎంపీ కనకమేడల గారు రిపోర్టు ఇచ్చారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడవడంలేదని మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు.
మనం భారతదేశంలో ఉన్నామా? లేక ఇస్లామిక్ దేశంలో ఉన్నామా?
ఈ ఊరివాడు ఆ ఊరు వెళ్లడానికి కూడా ఆంక్షలా?. ఈ జిల్లావాడు ఆ జిల్లాకు వెళ్లకూడదా? ఏమిటి ఈ అడ్డంకులు? పుంగనూరు ఏరియా ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా? శ్రీకాకుళం నుంచి పుంగనూరు మీదుగా కుప్పం కు సైకిల్ యాత్ర చేస్తుంటే అడ్డుకోవడం తగదు. రైడీతో దాడి చేయించడమా? పుంగనూరు ఎస్పీ నంగనాచిలా మాట్లాడుతున్నారు. ఈయన రౌడీలా వ్యవహరిస్తున్నారు. సుమోటోగా కేసు నమోదు చేశాం, చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇవా చర్యలు? రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం మీకెవరిచ్చారు? జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తలుపు చెక్కతో టీడీపీని, తమలపాకుతో వైసీపీని కొట్టి ఇద్దరినీ కొట్టానని చెబుతున్నారు. ఎస్పీ యాక్షన్ ను మేం గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. శాంతి భద్రతలను కాపాడటంలో జిల్లా ఎస్పీ ఫెయిల్ అయ్యారు. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఎన్నికల వరకు చిత్తూరు జిల్లాలో ఉంటే శాంతి భద్రతలు కాపాడలేడు.
డీజీపీగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు గడిచినా టీడీపీ వారిని ఆయన ఆఫీసుకు రానివ్వలేదు
రాజేంద్రనాధరెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు గడిచినా టీడీపీ వారిని ఆయన ఆఫీసుకు ఏనాడు రానివ్వలేదు. ఒక్క రెప్రజెంటేషన్ కూడా తీసుకోలేదు. నేను 21న లెటర్ రాస్తే లెటర్ రాలేదనడమేమిటి? డీజీపీ రాష్ట్రానికి కాదు, ప్రజలకు కాదు కేవలం వైసీపీకి మాత్రమే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీపై డీఓపీకి కంప్లైంట్ చేస్తాం. ఈ విధానాన్ని డీజీపీ మానుకోవాలి. అధర్మంగా తన భర్తను అరెస్టు చేయడంతో చలించి నారా భువనేశ్వరి గారు ‘నిజం గెలవాలి’ యాత్రకు సిద్ధమయ్యారు. ఆమె యాత్రకు భద్రత కల్పించాలి.
రోజా మంత్రి అయినప్పటి నుంచి ఆమె ప్రవర్తన వెకిలిగా ఉంటోంది
రోజా హావ భావాలు, ఆమె వ్యవహార శైలి, ఆమె నవ్వు, ఆమె చేష్టలు వెకిలిగా ఉంటున్నాయి. రోజా మాట్లాడే తీరు జుగుప్సాకరంగా ఉంటోంది. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి కుమార్తె, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మా అధినేత చంద్రబాబునాయుడు భార్య గురించి హేళనగా మాట్టాడారు. భువనేశ్వరి కాలి గోటికి కూడా రోజా సరితూగలేరు.
నారా భువనేశ్వరి ఎన్నడూ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రమే వస్తారు. తరువాత ఆమె పనిలో ఆమె మునిగితేలుతుంటారు. రోజా మాటలు గురిగిందగింజ సామెతను తలపిస్తున్నాయి. టీడీపీ సభ్యత, సంస్కారం కలిగిన పార్టీ. అసత్యపు సాక్ష్యాలను సృష్టించి చంద్రబాబు గారిని అరెస్టు చేశారు, ఆయన కడిగిన ముత్యంలా బయటికి వస్తారని టీడీపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.