Suryaa.co.in

Andhra Pradesh

సెలక్ట్.. ఎలక్ట్.. కలెక్ట్ యాత్ర

– అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన వారెవరో టీడీపీ గెజిట్ ఈనాడులో రాసిన పేర్లు చూస్తే తేటతెల్లమవుతుంది.
– రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

టీడీపీ శవయాత్ర.. చంద్రబాబు వసూళ్ల యాత్ర
అమరావతి పాదయాత్ర పేరుతో చంద్రబాబు చేయిస్తున్న యాత్ర.. అదే, తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా శవయాత్రగా మారబోతోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే, చచ్చిపోయింది కాబట్టి.. ఆ శవాన్ని పెట్టుకొని చేసే యాత్ర ఇది. Select, Elect, Collect యాత్ర ఇది. దుష్టచతుష్టయానికి చెందిన కొన్ని శక్తులు.. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఎటూ నూకలు చెల్లిపోయాయి కాబట్టి, చంద్రబాబుకు తాళ్లు, బుల్డోజర్లు, క్రేన్‌లు పెట్టినా లేవలేరు కాబట్టి అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి.. కలెక్షన్స్ చేసే దిక్కుమాలిన యాత్ర ఇది. మేమంతా ఈ ప్రాంతంలోనే పుట్టాం. పెరిగాం. మేమంతా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వికేంద్రీకరణకు మద్దతు పలుకుతున్నాం.చంద్రబాబు సామాజిక వర్గం మాత్రమే అమరావతి రాజధానిగా ఉండాలంటున్నారు.

ఈనాడులో రాసిన పేర్లు చూడండి.. ఉద్యమానికి మద్దతు తెలిపిన వారెవరో..
అద్భుతమైన పరిపాలనతో చరిత్ర పుటల్లో సీఎం జగన్ మోహన్‌ రెడ్డి కి ఉన్నత స్థానం లభిస్తుంది. అమరావతిలో ఒక కులం మీద మేమేమీ నిందలు వేయట్లేదు. టీడీపీ గెజిట్ ఈనాడులోనే రాశారు. అమరావతి యాత్రకు మద్దతు తెలిపిన వారెవరో అని. సీపీఐ నారాయణ, రేణుకా చౌదరి, చింతమనేని ప్రభాకర్ చౌదరి, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్‌ చౌదరి, పాతూరి నాగభూషణం వీరంతా ఎవరు..? వీరి పేర్లు ఈనాడులో రాయమని చెప్పామా? అని జోగి రమేశ్ నిలదీశారు. అమరావతి ఉద్యమానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులకు అసలు సంబంధం ఉందా? అమరావతిపై విషం కక్కామన్నారు. మరి, మీరు రాసిన పేర్లు ఎవరివి? వారి సామాజిక నేపథ్యం ఏమిటని జోగి రమేష్ ప్రశ్నించారు. మరి ఇప్పుడు చెప్పండి. ఈ ఉద్యమం చేస్తోంది ఎవరు? ఇక్కడ పుట్టిపెరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దీనితో సంబంధముందా? చచ్చిపోయిన తెలుగుదేశం శవయాత్రే ఈ అమరావతి ఉద్యమం.

పోలవరం, అమరావతిని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారు
2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌సీపీనే విజయం సాధించింది. ప్రత్యేకించి.. గుంటూరు, విజయవాడ ప్రజలూ మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం జగన్‌ గారు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అమరావతిని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి దోచుకు తిన్నాడు. ఈరోజు కూడా అమరావతి పేరుతో అమరావతి నుంచి అమెరికా వరకు చంద్రబాబు వసూళ్లు చేస్తున్నారు.

అమరావతిలో ఉన్న ఒక సామాజిక వర్గానికి, ఒక కులానికి అన్యాయం జరిగిందని.. వీళ్ళంతా ఒక కోటరీగా తయారయైపోయారు. కలెక్షన్ కింగ్‌లను అమరావతి నుంచి అమెరికా వరకు పంపించారు. పోలవరాన్ని చంద్రబాబు ఎలా ఏటీఎంగా మార్చుకున్నాడో.. అలాగే.. అమరావతిని మార్చుకున్నారు. అమరావతి ఉద్యమంలో కొందర్ని సెలక్ట్ చేసి చంద్రబాబు పంపించారు. వారిది ఏ కులం? ఏ సామాజికవర్గం. బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుగా మేము అంతా జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో బావున్నాం. ఏ గడపకు వెళ్ళినా.. మా కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంటున్నారు. మా పిల్లలు చదువుకుంటున్నారని చెబుతున్నారు. ప్రతి పేద కుటుంబానికి ఒక చేయూత, ఒక ఆసరా సీఎం జగన్‌ కల్పిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సామాజిక సంస్కరణలు అమలవుతున్నాయి. అన్ని వర్గాల పేద కుటుంబాలుకు లబ్ధి, అభివృద్ధి జరుగుతోంది.

అమరావతికే లక్షల కోట్లు కుమ్మరిస్తే ఎవరు బాగుపడుతారు?
అమరావతికే లక్షల కోట్లు కుమ్మరించాలని చంద్రబాబు అంటున్నారు. అమరావతిలో లక్ష నుంచి మూడు లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎవరికి ఉపయోగం, దానివల్ల ఎవరు బాగుపడతారు? చంద్రబాబు ఒక్క అమరావతే కావాలంటాడు. ఈరోజు పేద వర్గాల పిల్లలకు నాడు-నేడు కింద స్కూళ్ళు అభివృద్ధి చేయటంతో పాటు, ప్రతి తల్లికీ అమ్మ ఒడి అందుతోంది. అంతేకాకుండా విద్యా కానుక కిట్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ప్రతి పేద కుటుంబానికి ఆసరా, చేయూత, పెన్షన్‌ అందుతోంది. మేం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందడం కాదా.. అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా.. మూడు ప్రాంతాల ప్రజలంతా సమంగా అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు వెళ్లాలన్న గొప్ప ఆలోచనలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో వేర్పాటువాదం రాకుండా.. ఒక ప్రాంతం వారు ఇంకో ప్రాంతం మీద విమర్శలు చేసుకునే పరిస్థితి రాకూడదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని విశాల హృదయంతో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు మద్దతు పలికారు.

తండ్రి, తాతల పేరు చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు, లోకేశ్‌లు
విజయవాడ నగరంలో 40 గుళ్లు చంద్రబాబు కూలగొట్టారు. గుళ్లు కూలగొట్టిన ఓ అసమర్థుడు ఆధ్వర్యంలో అమరావతి యాత్రలో దేవుడ్ని పెట్టుకొని 2.0 అని సినిమా టైటిల్‌ పెట్టుకొని పబ్లిసిటీ ఏంటని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. తన ఇంట్లో వాళ్లను ఏదో అన్నారని వెక్కి వెక్కి ఏడుస్తాడు తప్ప.. చంద్రబాబు ఏమీ చేయలేడు. చంద్రబాబు, లోకేశ్‌లు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని బ్రతుకుతారు తప్ప, వారి తండ్రుల పేర్లు చెప్పుకోలేరు. సొంతంగా పార్టీ పెట్టి.. అధికారంలోకి వచ్చిన మొనగాడు, ధీశాలి సీఎం జగన్‌ . అటువంటి జగన్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదు.

ఉత్తరాంధ్రకు ఏమివద్దని చేస్తున్న దండయాత్ర
పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని.. ఆయన మరణానికి కారకులు అయిన మీరా కుటుంబ, రాజకీయ విలువలు గురించి మాట్లాడేది..?. విలువలకు, విశ్వసనీయతకు సీఎం జగన్ మారు పేరు. పైగా సీఎం జగన్ పై ఛాలెంజ్‌లు చేయటం ఏంటి? వెనుకబడిన ఉత్తరాంధ్ర వెళ్ళి, అక్కడ అధికంగా ఉండే మా బీసీలను రెచ్చగొడతారా…? చంద్రబాబు పన్నిన పన్నాగం ఇది. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారు.

మద్దతు ఉంటే.. మరి బౌన్సర్లు ఎందుకు..?
అభంశుభం తెలియని కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి లాగితే.. ఊరుకోం. అమరావతి యాత్రపై సానుభూతి, మద్దతు ఉంటే మరి బౌన్సర్లు ఎందుకు.? దీనినిబట్టి అర్థం కావడం లేదా.. దండయాత్ర చేయటానికే చేస్తున్న యాత్ర ఇది అని. అంటే, చంద్రబాబు సామాజిక వర్గం తప్ప రాష్ట్రంలో ఇంకెవ్వరూ అభివృద్ధి చెందకూడదా.? ఇదెక్కడి దుర్మార్గం. దమ్ముంటే, రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక న్యాయం మీద చర్చకు చంద్రబాబు శాసనసభ రావాలి. ఈ అంశం మీద సీఎం జగన్ తో మాట్లాడి ఒకరోజు కేటాయిద్దాం. వచ్చే దమ్ముందా బాబూ..?.

LEAVE A RESPONSE