Suryaa.co.in

Andhra Pradesh

బాలినేని మామకు వేల కోట్ల బల్లికురవ గ్రానైట్ కొండ ధారాదత్తం

– బాలినేని అక్రమాల్లో సీనియర్ ఐఏఎస్ లు ధనుంజయ రెడ్డి , శ్రీలక్ష్మి , మైన్స్ వెంకట రెడ్డి లకు వాటా
– మంత్రిగా అవినీతి చేశానని ఒప్పుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ని భర్తరఫ్ చేయాలి
తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి
– మామ బాలినేని వాసు వేలకోట్ల అక్రమ సంపాదనలో తాడేపల్లి ప్యాలెస్ కు వాటా
– వేలకోట్ల అక్రమాలు బయటపడిన జరగని విచారణ…తొలగని కబ్జా
– తాజాగా వేల కోట్ల రూపాయల విలువచేసే 500 ఎకరాల బల్లికురవ గ్రానైట్ కొండ అప్పగింత
– లంచాలు తీసుకున్నానని బహిరంగంగా అంగీకరించిన బాలినేని పై ఈ డి, సి బి ఐ లతో విచారణ జరపాలి
– బాలినేని బినామీలైన వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, ప్రణీత్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి తదితరుల లావాదేవీలపై ఈ డీ విచారణ జరపాలి.
– జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్

విశాఖపట్నం,డిసెంబర్ 12:-మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రిగా తన లంచాలు తీసుకున్నట్టు అంగీకరించటం హర్షించదగ్గ పరిణామం.మంత్రిగా బాలినేని అక్రమాలకు పాల్పడ్డారని ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి పేరిట వేలాది ఎకరాల భూములు సంపాదించారని, సినిమాల్లో పెట్టుబడులు పెట్టారని గతంలో చేసిన ఆరోపణలను బాలినేని సమర్థించినట్ల అయింది. శాసన సభ్యునిగా మంత్రిగా తాను చేసిన ప్రమాణానికి విరుద్ధంగా లంచాలు తీసుకున్న శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి.

మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతిలో వరుసకు అల్లుడైన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని విశ్వసిస్తున్నాం…ఆ కారణంగా నే బాలినేని అక్రమాలు, అవినీతి పై విచారణ కు ఆదేశించలేదు. రాష్ట్రంలో ఏ మూల సర్పంచ్ స్థాయి వ్యక్తి అవినీతికి పాల్పడిన పసిగట్టే ముఖ్యమంత్రి -బాలినేని వేలకోట్ల సంపాదనకు సహకారం అందించారు. బాలినేని అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చినప్పటికీ స్వయంగా ఆయనే అవినీతికి పాల్పడినట్లు ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోకుండా వెనకేసుకురావడం దారుణం.

అవినీతిపరుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వెనకేసుకు రావటమే కాక వేల కోట్ల రూపాయల విలువచేసే బాపట్ల జిల్లా బల్లికురవలోని సర్వేనెంబర్ 1067, 1098, 1100, 1101, 1102, 1103, 1198, 1234, 1235, 1236, 1237 లోకంలోని 500 ఎకరాల బ్లాక్ గ్రానైట్ కొండను బాలినేని బినామీలకు ముఖ్యమంత్రి అప్పగించటం అవినీతిని ప్రోత్సహించటమే. ఆదాయం పన్ను రిటర్న్స్ లో పట్టమని పది లక్షల ఆదాయం కూడా లేని బాలినేని బినామీలు బల్లికురవలో ఏకంగా ఐదు వందల ఎకరాల బ్లాక్ గ్రానైట్ కొండను గుప్పిట పెట్టుకోవడం గమనార్హం.

బాలినేని బినామీలైన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి కుమారుడు కుండా సాయి కళ్యాణ్ రెడ్డి , భాస్కర్ రెడ్డి దగ్గర గుమస్తాగా పని చేసే సిరికి రెడ్డి బ్రహ్మారెడ్డి, భాస్కర్ రెడ్డి బంధువైన కుండా రాజ కిషోర్ రెడ్డి , ఊరిబిండి కృష్ణ కిషోర్ రెడ్డి తదితరుల పేరిట రామిరెడ్డి మినరల్స్, పురుహితిక మినరల్స్, ఎస్ ఎల్ ఎన్ మినరల్స్, శ్రీమాతా గ్రానైట్స్, సిద్దన్ గ్రానైట్స్ కంపెనీల ద్వారా 500 ఎకరాలకు పైగా ఉన్న బల్లికురవ కొండలు మొత్తం బాలినేని తనకబంద హస్తాల్లో పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రానైట్ రంగంలో ఉన్న వ్యాపారులు ఎవరు దరఖాస్తు చేయకుండా తన బినామీలే మైనింగ్ శాఖ ఆమోదం పొందేట్టు ఆయన పావులు కదిపారు.

బాలినేని మంత్రిగా ఉండగా ఈ ప్రాంతమంతా ప్రకాశం జిల్లాలో భాగం. ఈ 500 ఎకరాల విలువ వేల కోట్లలో ఉంటుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదంతో ముఖ్యమంత్రి ఓ ఎస్ డి ధనుంజయ రెడ్డి, మైనింగ్ ఉన్నతాధికారి వెంకట రెడ్డి సహకారంతో ఈ తతంగం అంత నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పారదర్శకతకు పెద్దపేట వేస్తే నిజాయితీ నిబద్ధతలతో పనిచేస్తే బల్లి కురులు గ్రానైట్ కొండ లీజులను వెంటనే రద్దు చేయాలి.

బాలినేని వియ్యంకుడైన కుండా భాస్కర్ రెడ్డి అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం చౌడేపల్లి లో 30 ఎకరాల అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ భూములను కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన లే అవుట్ పై ఈరోజు వరకు చర్యలు లేవు.అధికారులు అక్రమమని నిర్ధారించినప్పటికీ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీలక్ష్మి ,ధనుంజయ రెడ్డిలు ఈ కబ్జాను కాపాడుతున్నారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం అటవీ శాఖ భూమి కబ్జా అయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. బాలినేనికి ముఖ్యమంత్రి పేషీ నుంచి లభిస్తున్న సహకారం కారణంగా ఇక్కడ ఎటువంటి చర్యలు లేవు.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నగర శివారులోని వెంగముక్కలపాలెంలో శ్రీకర లేఔట్ పేరుతో వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న విల్లాల ప్రాంతంలో అరఎకరం పైగా నీటిపారుదల శాఖ చెరువు కబ్జా గురైంది. సర్వే నెంబర్ 92లో రెండు ఎకరాలకు పైగా ఆర్ అండ్ బీ భూమి ని కలుపుకొని కాంపౌండ్ వాల్ నిర్మించారు.

సర్వేనెంబర్ 93లో రెండు ఎకరాలు పోరంబోకు భూమిని కూడా ఆక్రమించారు.ఈ లే అవుట్ కి ఇప్పటికీ అనుమతులు లేవు.అయినా చర్యలు లేవు.బాలినేని పాతిక వేల ఇళ్ల స్థలాల పేరుతో గొప్పగా చెబుతున్న సర్వే రెడ్డి పాలెం లో వేల లారీల మట్టిని తవ్వి ఈ లేఔట్ అవసరాల కోసం తరలించారు.ఈ అక్రమంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు.స్థానిక ప్రజలు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఎన్ని పర్యాయాలు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు.

గరుగుబిల్లి మండలం బిట్రగుంట గ్రామంలో భాస్కర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారు.గతంలో ప్రభుత్వం కుమ్మర్ల కేటాయించిన 6:30 ఎకరాల భూమిని కబ్జా చేశారు.మంగమూరి డొంక రావి చెట్టు దగ్గర బ్రాహ్మణుల భూమిని కూడా కబ్జా చేశారు.దీంతోపాటు అక్కడ తనకున్న 120 ఎకరాల చేపల చెరువులను ప్రభుత్వ భూములను కలుపుకొని 200 ఎకరాలుగా మార్చుకున్నారు.వీటన్నిటిపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలు లేవు.

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బాలినేని కేవలం ఆస్తి ఐదు కోట్ల రూపాయలు మాత్రమే.అయితే మంత్రిగా పెద్ద ఎత్తున అధికారులు దుర్వినియోగానికి పాల్పడి బినామీలకు వేల కోట్ల సమకూర్చి పెట్టారు.హైదరాబాదులో త్రిబుల్ వన్ జీవో పరిధిలో భూములు కొనటంతో పాటు పెద్ద సంఖ్యలో విల్లాలు కొనుగోలు చేశారు.ఈ వివరాలన్నీ ముఖ్యమంత్రి పేషీలో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమే అవుతుంది.

శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కి బంధువైనందునే చర్యలు తీసుకోవడం లేదని అందరూ భావిస్తున్నారు.ఇప్పటికైనా స్పందించి సిబిఐ, ఈ డీల ద్వారా బాలినేని ఆయన బినామీల లావాదేవి లపై సమగ్ర విచారణ జరిపి వందల కోట్ల ప్రభుత్వ భూములను, కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

గతంలో బాలినేని వియ్యంకుడైన కుండా భాస్కర్ రెడ్డి వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసిరారు.అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆస్తి మొత్తం రాసిస్తానని బాలినేని సవాల్ విసిరారు.ఇప్పుడు స్వయంగా ఆయనే అవినీతికి పాల్పడ్డట్టు అంగీకరించినందున రాజకీయ సన్యాసం చేసి అచ్చుతాపురం ,ఒంగోలు లే అవుట్ లను ఇచ్చిన మాట ప్రకారం జగనన్న కాలనీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేనిపక్షంలో ప్రభుత్వమే సాధనం చేసుకోవాలని కోరుతున్నాం.బాలినేని పై గతంలో చేసిన ఆరోపణలు రుజువైనందున ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.అక్రమంగా సంపాదించిన ఆస్తులను తిరిగి అప్పగించాలి.

గతంలో బాలినేని పై ఆరోపణలు చేసినప్పుడు నాపై చంపుతామని బెదిరింపు లకు దిగారు.పోలీసులతో అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేశారు.ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి అధికార దుర్వినియోగం, బెదిరింపులు, దౌర్జన్యాలు మానాలి.బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

LEAVE A RESPONSE