Suryaa.co.in

Andhra Pradesh

శభాష్ సురేష్..

– బద్వేల్ బీజేపీ అభ్యర్థి సురేష్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందన
తిరుపతి: మూడు రోజుల పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బీజేపీ నాయకులు తిరుపతి విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చొరవ తీసుకొని.. బద్వేలు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పనతల సురేష్ ను అమిత్ షా కు పరిచయం చేశారు. బద్వేల్ ప్రస్తావన చేయగానే… అమిత్ షా స్పందిస్తూ.. ‘సురేష్.. ఎన్నికల్లో బాగా పని చేశావు. గుడ్. చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ అప్యాయంగా భుజం తట్టారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. రెండు నిమిషాలు సురేష్ తో మాట్లాడారు.

LEAVE A RESPONSE