నెల్లూరులో జరిగిన సంఘటనలు ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి మీ ముందు పెడుతున్నాను. నవంబర్ 15 తారీకు జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సహాయంతో ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకొని పట్టపగలే 500 నుండి రెండు వేల రూపాయల వరకు ఓటర్లకు పంచుతున్నారు.
సాధారణంగా గతంలో పేద ప్రజానీకం నివసిస్తున్న కాలనీలో రాత్రులు ఎవరు చూడని సమయంలో పోలీసుల కళ్లుగప్పి నిద్రలేపి డబ్బు పంచేవారు. ఈ ఎన్నికల్లో పగలే డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చిన వారే అమ్మ , అయ్యా ప్రమాణ పూర్తిగా మాకే ఓటు వేయాలి అని వారికి వారే చెప్పుకుంటూ కమిట్ చేసుకుంటూ పంచుతున్నారు .
ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాసు వారికి కొన్నిచోట్ల అప్పర్ మిడిల్ క్లాసు వారికి కొన్నిచోట్ల ఇళ్లకు వచ్చి డబ్బులు ఇస్తున్నారు ఈ కేటగిరీ ఇళ్ళకి రాత్రులు పోయి తలుపు తట్టలేరు కాబట్టి పగలే ఇస్తున్నారు తీసుకున్నవారు తీసుకుంటున్నారు వద్దు అన్న వాళ్లు వద్దు అంటున్నారు.ఈ వింత పోకడ ఏమిటో ప్రజా నీకం అర్థం చేసుకోవాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా సరే గెలవాలి .
విజ్ఞులైన ప్రజలారా! తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు అధికార పార్టీవారు ఓటుకు ఆరువేల రూపాయలు ఇచ్చారు తీసుకున్నారు బిజెపికి ఓటు వేసి 23,500 ఓట్ల మెజారిటీతో గెలిపించారు .మీరు కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి ఓటు బిజెపికి వెయ్యండి. బిజెపి జనసేన అభ్యర్థులను గెలిపించండి .
ఈ దురాగతాన్ని అరికట్టాలంటే కొంతమంది అయినా వాళ్ల పోకడను, ఈ పద్ధతిని,ఈ రకంగానైనా బుద్ధి చెప్పకపోతే ఈ దేశంలో డబ్బున్న వాడిదే రాజ్యం, రౌడీలదే రాజ్యం , అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. నిజాయితీగా సిద్ధాంతం నమ్ముకొని ,ఒకే పార్టీలో ఉంటూ సేవ ద్వారా రాజకీయాల్లో పేద ప్రజల కోసం పని చేసే వారు ఈ డబ్బు రాజకీయాలలో ఈ పోకడలో తట్టుకోలేరు ఇది ప్రజలకు నష్టం ఇది ఈ సమాజానికి అరిష్టం.దీనికి పరిష్కారం మన ఓటే ఆయుధం.దయచేసి విజ్ఞులైన ప్రజలారా ఆలోచించండి.
కరణం భాస్కర్ ,
బి జె పి,
నెల్లూరు ,
మొబైల్ నెంబర్7386128877.