Suryaa.co.in

Andhra Pradesh

సిగ్గులేకుండా అవినీతి మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై విష ప్రచారమా?

• స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి న్యాయస్థానం ముందు సరైన ఆధారం చూపలేకపోయారు
• చంద్రబాబుని అన్యాయంగా 52రోజులు జైల్లో పెట్టి తప్పు చేసినందుకు జగన్ రెడ్డి, అతని జేబుసంస్థ సీఐడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
• చంద్రబాబు బెయిల్ వాదనలపై హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనలు ఆయన అమాయకత్వానికి… అవివేకానికి నిదర్శనం
• చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే తనకు.. తనప్రభుత్వానికి పుట్టగతులుండవన్న భయం జగన్ లో మొదలైంది
• ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే తన అవినీతి మీడియాలో ఏకంగా న్యాయస్థానాలు.. జడ్జిలపై దుష్ప్రచారానికి తెరలేపాడు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్

టీడీపీ అధినేత చంద్రబాబుకి రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో పాటు, చంద్రబాబు అభిమానుల్ని ఆనంద డోలికల్లో ఊగిసలాడేలా చేసిందని, ఈ సంతోష సమయంలో అవినీతి పుత్రిక సాక్షి న్యాయస్థానం తీర్పుపై.. న్యాయవ్యవస్థపై బురదజల్లుతూ విషపురాతలు రాసిందని, జగన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపులు.. వైసీపీ ప్రభుత్వ వికృతచేష్టలకు వంత పాడేలా సాక్షి మీడియా వివక్షతతో వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా సాక్షి దినపత్రిక తప్పుడు రాతలతో.. దుష్ప్రచారంతో న్యాయస్థానాల్ని తప్పుపట్టడం క్షమించరాని తప్పిదం. చేయని తప్పుకు చంద్రబాబునాయుడు అన్యాయంగా 52రోజులు జైల్లో ఉన్నారు. ఆ తప్పు చేసినందుకు జగన్ రెడ్డి, అతనిజేబుసంస్థ సీఐడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం.. ముఖ్యమంత్రి. చంద్రబాబునాయుడి విషయంలో వ్యవహరిం చిన తీరుని ప్రశ్నించాల్సిన సాక్షి మీడియా.. ప్రతిపక్షనేతకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టడం, పరిధిదాటి న్యాయస్థానంపై విమర్హలు చేయడం నీచాతినీచం.

ఆధారాలు చూపలేక కోర్టు ముందు పరువు పోగోట్టుకొని సిగ్గులేకుండా అవినీతి మీడియాలో విషప్రచారం చేస్తారా?
చంద్రబాబునాయుడిని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసింది మొదలు.. ఆయన జైల్లో ఉన్నప్పుడు.. నేటికీ ఈ ప్రభుత్వం, రాష్ట్రసీఐడీ ఆయన తప్పు చేశాడని చెప్పే ఒక్క ఆధారం తమ ముందు ఉంచలేకపోయిందని న్యాయస్థానమే చెప్పింది. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాలకులు సాక్షిలో ఇంకా విషపు రాతలురాయిస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా 21.3లక్షల మందికి ఉపాధి, ఉద్యోగావకా శాలకు శిక్షణ అందించి, దాదాపు 70 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేయడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్ లో తప్పు జరిగిందని చంద్రబాబు అవినీతి చేశాడని.. ఆయన దాదాపు రూ.3వేలకోట్లు తిన్నారని చెప్పిన జగన్ సర్కార్..ఏపీ సీఐడీ తమ వాదనలకు బలంగా నిలిచే ఒక్క సాక్ష్యాన్ని కూడా ఎందుకు న్యాయస్థానం లో ఉంచలేకపోయింది.

నిజంగా నిధులు దారిమళ్లితే .. ఏపీ.ఎస్.ఎస్.డీ.సీ. (ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) కి నష్టం జరిగితే దానికి సంబంధించిన ఆధారాలను సీఐడీ హైకోర్టు ముందు ఎందుకు ఉంచలేకపోయిందో చెప్పాలి. ఇన్ కంటాక్స్ విభాగం వారు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని చెప్పిన సీఐడీ.. రాష్ట్ర ప్రభుత్వం, ఆ నోటీసులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ఎందుకు కోర్టు ముందు ఉంచలేదు. కేవలం ఇన్ కంటాక్స్ పేరుచెప్పి సీఐడీ కేసుని తప్పుదారి పట్టించింది.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన అగ్రిమెంట్లో అధికారులు.. ఇతరులు పెట్టిన సంతకాలతో చంద్రబా బునాయుడికి ఏం సంబంధమని, స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు..సాఫ్ట్ వేర్ ఉన్నాయో లేదో పరిశీలించాల్సి ఫోరెన్సిక్ ఆడిట్ విభాగం వారేనని.. దానితో చంద్రబాబుకి ఎలాంటి సంబంధం ఉంటుందో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నిస్తే, సీఐడీ న్యాయవాది ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు?

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నిధులు విడుదల చేయాలని ఓరల్ గా ఆర్డర్స్ ఇచ్చినంత మాత్రాన ఆయన తప్పుచేశాడని ఎలా చెబుతారన్న న్యాయస్థానం ప్రశ్నకు కూడా సీఐడీ న్యాయవాది నుంచి సమాధానం లేదు. శరత్ అసోసియేట్స్ ఇచ్చిన ఆడిట్ నివేదిక.. ఏపీ.ఎస్.ఎస్.డీ .సీ ఇచ్చిన నివేదికకు ఎక్కడా పొంతనలేదని, రెండింటిలో దేన్ని నమ్మాలో చెప్పా లని న్యాయస్థానం ప్రభుత్వన్యాయవాదిని ప్రశ్నించింది నిజంకాదా? చంద్రబాబు ఏ రకంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారో.. ఆధారాలు రూపుమాపుతారో చెప్పాలన్న న్యాయస్థానం ప్రశ్నకు కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు.

చంద్రబాబు బెయిల్ పై కండిషన్లు పెట్టాలన్న ప్రభుత్వ న్యాయవాది వాదనల్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. చంద్రబాబు రాజకీయ సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించడం ఆయన వాక్ స్వాతంత్ర్యాన్నిహరించడమేనన్న న్యాయస్థానం వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు కావా? 2017 జూన్ 30న స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన అగ్రిమెంట్ జరిగితే, 2014, 2016 లో జరిగిన వాట్సాప్ ఛాటింగ్ ఆధారంగా ఏపీ.ఎస్.ఎస్.డీ.సీ నిధులు దారిమళ్లించారని చెప్పడాన్ని బట్టే ప్రభుత్వం వద్ద ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ఆయన అమాయకత్వనాకి నిదర్శనమా…. లేక ఆయన అవివేకమనుకోవాలో తెలియని స్థితి.

ఈ విధంగా ప్రభుత్వం వైపు నుంచి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లెక్కకు మిక్కిలి తప్పులు కనిపిస్తుంటే… వాటిని వదిలేసి సాక్షి మీడియా బెయిల్ ఇచ్చిన న్యాయ స్థానాల్ని..బెయిల్ పొందిన చంద్రబాబుని తప్పుపడుతూ సిగ్గులేకుండా తప్పుడురాతలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే తనకు..తన ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్న భయంతోనే జగన్ రెడ్డి తన అవినీతి మీడియాలో న్యాయస్థానాలపై విషపు రాతలు రాయిస్తున్నాడు
చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలా మరలా ప్రజల్లోకి వెళ్తే తనకు.. తన ప్రభుత్వానికి పుట్టగతులుండవన్న భయంతోనే తన అవినీతి మీడియాలో జగన్ రెడ్డి విషపురాతలు రాయిస్తున్నాడు. తప్పుడు కేసులతో ఏదోరకంగా చంద్రబాబు ని ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనుకున్న జగన్ రెడ్డి కుట్రలు..కుతంత్రాలకు హైకోర్ట్ చెక్ పెట్టిందనే చెప్పాలి. న్యాయస్థానం తీర్పు ధర్మానికి అనుకూలంగా వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించాలి.

తప్పుడు కేసులు..అక్రమ అరెస్టు లతో చంద్రబాబుని, ఇతర టీడీపీనేతల్ని ఏరకంగా జగన్ రెడ్డి ఇబ్బంది పెడుతు న్నాడో ప్రజలు గమనించాలి. భవిష్యత్ లో జగన్ రెడ్డి.. వైసీపీనేతలు ఇప్పుడు చేస్తున్నదానికి రెండింతలు అనుభవిస్తారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి నిర్ణయాలు.. అతని పాలనాపరమైన లోపాలపై కచ్చితంగా న్యాయవి చారణ జరిపించి తగిన విధంగా శిక్షిస్తుంది.

జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో తమ మానప్రాణాలు..ఆస్తులకు రక్షణలేదని మైనారిటీలు గ్రహించారు
మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీల మానప్రాణాలకు.. వారి ఆస్తులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించే నిధులు కూడా క్షేత్రస్థాయిలో వారి సంక్షేమానికి ఉపయోగపడటంలేదు. వైసీపీప్రభుత్వంలో మైనారిటీలపై జరిగిన 100కు పైగా దాడులు ముమ్మాటికీ వైసీపీ నేతలు..పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్లే జరిగాయి.

రాష్ట్రంలో సాగుతున్న ఫ్యాక్షన్ పాలనలో దళితులు..బీసీలు.. మైనారి టీలు సహా ఏవర్గం వారు సంతోషంగా లేరు. జగన్ రెడ్డి హాయాంలో తమకు రక్షణ లేదని.. వైసీపీ ప్రభుత్వం మాకు వద్దు అని మైనారిటీలు ఇప్పటికే ఒక నిర్ణయాని కి వచ్చారు. వచ్చేఎన్నికల్లో మైనారిటీలు పూర్తిగా తెలుగుదేశానికి సహకరిస్తారు. ” అని షరీఫ్ తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE