Suryaa.co.in

శ్రీ వేంకటేశ్వరుడికీ శని మహాదశ ప్రారంభమయింది
Political News

శ్రీ వేంకటేశ్వరుడికీ శని మహాదశ ప్రారంభమయింది

హరిశ్చంద్రుడికీ దరిద్రం పట్టింది
సర్ధుకుపోకపోతే…. యమకింకరులు
ధర్మం కుంటుతూ నడుస్తుందంటే ఏమిటో అనుకున్నా…. చివరకు కలియుగ వైకుంఠపాలకుడు శ్రీ వేంకటేశ్వరుడికీ శని మహాదశ ప్రారంభం అయింది అన్నమాట. హరిశ్చంద్రుడు జాతకం, పట్టబోతోందన్న మాట…సార్. నేనేమీ ఎవరినీ తూలనాడలేదు సార్… మళ్లీ అదేదో అనుకునేరు. తప్పు ఎవరిదీ కాదు. కలిపురుషుడు చేసే విన్యాసాల కారణంగా ఇలా జరిగిపోతుంటాయి. 19 కి ముందు నేను ఓ సిద్ధాంతి వద్దకు వెళ్లాను. అప్పుడే ఆయన చెప్పాడు…సార్ దరిద్రం మీకే కాదు….హరిశ్చంద్రుడికీ పట్టింది. ఆయన కూడా శని ప్రభావానికి లోనయ్యారు అని తేల్చి చెప్పారు. అంటే శని ప్రభావం వల్ల ఇదంతా జరుగుతోంది. సాక్షాత్తు లయకారకుడు అయిన పరమ శివుడు చెట్టు తొర్రలో దాక్కున్నాడంట. మరి నిజమో కాదా నాకు తెలియదు. అది అప్పడు. మరి ఇప్పడు ప్రత్యక్యంగా మాత్రం వెంకటేశ్వరుడు ఏక్కడ దాక్కుంటాడో తెలియడం లేదు. సర్వలోకులు వదిలిన పాపాల కారణంగా పాపం ఆయనకు ఈ స్థితి దాపురించి వుండవచ్చు సుమా… ఇందులో నీతి ఏమిటంటే ఎవరి తప్పూ లేదు. ఇదంతా కలిపురుషుడి ప్రభావం. అని సర్ధుకుపోకపోతే…. యమకింకరులు అదే రఘురామకు, మరో కొందరికి పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త. ప్రశ్నలు వేస్తే తల వెయ్యి ముక్కలు కాదు. ఎముకలు 206 నుంచి వెయ్యి అవుతాయి.

LEAVE A RESPONSE