-ఈ దొంగ మంత్రి నిరంజన్ రెడ్డి కి సిగ్గుందా?
-చరిత్ర అంటే వైఎస్ఆర్ ది…కేసీఅర్ ది కాదు.
-పాలమూరు ప్రాజెక్ట్ కోసం నిరాహార దీక్ష చేస్తా
-సిగ్గుమాలిన నిరంజన్ రెడ్డి తెలుసుకో
-వైఎస్సార్ ది రక్త చరిత్ర అని అనడం పై ఆగ్రహం
-మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి విరుచుకుపడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌పై శరపరంపరగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల, ఈసారి మంత్రి నిరంజన్‌రెడ్డి లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఆయనను వీధికుక్కతో పోల్చారు. ఆయన తీరు మార్చకపోతే చీపుర్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
షర్మిల ఇంకా ఏమన్నారంటే… ఈ జిల్లాకు మంత్రి ఉన్నాడు.. నీళ్ళ నిరంజన్ రెడ్డి.ఆయనకు సిగ్గు ఉండాలి.. పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు ప్రాజెక్ట్ ముఖ్యమైన ప్రాజెక్ట్.
ఈ జిల్లాకు 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్.కమీషన్లు తిన్నారు…ప్రాజెక్ట్ మాత్రం ముందుకు సాగలేదు. కేసీఅర్ కి పాలమూరు ప్రాజెక్ట్ పై ప్రేమ లేదు.దక్షిణ తెలంగాణ మీద కేసీఅర్ కి ప్రేమ లేదు.పాలమూరు ప్రాజెక్ట్ కోసం కొట్లాడుతున్నది మేమే.
ఈ దొంగ మంత్రి నిరంజన్ రెడ్డి కి సిగ్గుందా… ఈ మంత్రి కి ఈ జిల్లాకు పాలమూరు ప్రాజెక్ట్ ఎంతో ముఖ్యం అని తెలియదా?ఈయన కన్నీళ్ళ నిరంజన్ రెడ్డి.. ఈయనను మోసగాడు అనాలి. ఈ నెల 14 న 24 గంటల పాటు పాలమూరు ప్రాజెక్ట్ కోసం నిరాహార దీక్ష చేస్తా.ఈ నీళ్ళ నిరంజన్ రెడ్డి కేసీఅర్ నీ అడగాలి కదా?ఏ రోజు కూడా పాలమూరు పై మాట్లాడలేదు. ఈయన ఒక వీధి కుక్క..
నిన్న వనపర్తి లో మేము ఇదే మాట అంటే ఆయన కు కోపం వచ్చింది అంట.పూలతో,హారతులతో స్వాగతం చెప్పారు..ఊరు ఊరంతా వచ్చారు.మా అభిమానం చూసి కడుపు మండింది అంట. వైఎస్సార్ ది రక్త చరిత్ర అని మాట్లాడాడు అంట. వైఎస్సార్ చరిత్ర ఏంటో నిరంజన్ రెడ్డి తెలుసుకోవాలి. ఒక్క సారి కాదు…లక్షా సార్లు మాట్లాడినా అబద్ధం నిజం అవ్వదు.
వైఎస్సార్ 5 ఏళ్ల పాలన చేస్తే ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేసిన చరిత్ర. వైఎస్సార్ బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసం తపించిన చరిత్ర.వైఎస్సార్ చనిపోయాక ఆ భాద తట్టుకోలేక 700 వందల మంది ఆయన వెనకాలే చనిపోయారు…ఇది వైఎస్సార్ చరిత్ర.చరిత్ర అంటే వైఎస్ఆర్ ది…కేసీఅర్ ది కాదు.సిగ్గుమాలిన నిరంజన్ రెడ్డి తెలుసుకో. బ్రతికితే వైఎస్సార్ లా బ్రతకాలి…చనిపోతే ప్రజలకోసమే చనిపోవాలి. వైఎస్సార్ లా బ్రతుకు నిరంజన్ రెడ్డి. సిగ్గు ,ఇంగితం,బుద్ది తెచ్చుకొని ప్రజల కోసం బ్రతుకు నిరంజన్ రెడ్డి. లేకుంటే చీపురు తో కొట్టండి..కర్రు కాల్చి వాత పెట్టండి. ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పండి.