-ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ పురుగులు గా చూస్తున్నారు
– భూములు అడిగితే జైల్లో పెడుతున్నారు
– వైఎస్సార్ హయాంలో అడగని వాడు పాపాత్ముడు అనే వారు
– ఏది అడిగితే అది లేదని అనకుండా ఇచ్చే వారు
డిగ్రీలు , పీజీ లు చదివి రోడ్లపై తిరుగుతున్నారు
– పార్టీ కొత్త కావొచ్చు… కానీ మా పార్టీ లో వైఎస్సార్ ఉన్నాడు
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండలం పట్వారిగుడెం బహిరంగ సభలో వైఎస్ షర్మిల
ఇదే పట్వారిగూడెం కి వైఎస్సార్ వచ్చారు. వెయ్యి 50 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో అడగని వాడు పాపాత్ముడు అనే వారు. ఏది అడిగితే అది లేదని అనకుండా ఇచ్చే వారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రి గా ఉండి కోట్లమంది గుండెలను గెలుచుకున్నారు.
మంచి మనిషి నాయకుడు అవుతాడు..మంచి నాయకుడు మహా నాయకుడు అవుతారు. అందుకే కోట్లమంది గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారు. పేద వారు గొప్పగా బ్రతకాలి అని ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారు.దమ్మపేట మండలం లో అత్యధికంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చారు.
వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ ,తర్వాత 8 ఏళ్లుగా ఉన్న టీఆరెఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వలేదు? వైఎస్సార్ బ్రతికి ఉంటే పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇచ్చే వారు. పోడు భూములకు కుర్చీ వేసుకొని మరి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇంత వరకు కేసీఆర్ కి కుర్చీ దొరకడం లేదు. తరాల తరబడి అవే భూములను నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఆ భూములను గుంజుకున్నారు… ట్రెంచ్ లు వేశారు.
భూములు అడిగితే జైల్లో పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ పురుగులు గా చూస్తున్నారు. రైతులు అప్పుల పాలు అయ్యారు. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంట
నష్టపరిహారం అడిగితే ఇవ్వలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది. వైఎస్సార్ పాలనలో వ్యవసాయానికి 25 వేలు సబ్సిడీ ఇచ్చే పతాకాలు ఉండేవి. అవన్నీ బంద్ పెట్టీ ముష్టి 5 వేలు రైతు బందు ఇస్తున్నాడు.
రైతు కూలీలు కేసీఆర్ కి మనుషులుగా కనపడడం లేదు. ధరలు పెంచి పేదవాడి నడ్డి విరుస్తున్నారు. బంగారు తెలంగాణ లో ఎవరు బాగుపడ్డారు? ఆయన కుటుంభం లో 5 ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీలు , పీజీ లు చదివి రోడ్లపై తిరుగుతున్నారు. అవమానం తో బ్రతకలేక ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చనిపోతున్నారు.
ఉద్యమ కారుడు కదా అని రెండు సార్లు అధికారం ఇస్తే ఏం చేశాడు? స్కూటర్ లో తిరిగే కేసీఆర్ ప్రైవేట్ జెట్ లో తిరుగుతున్నాడు. ఆడపిల్లలు ఉద్యోగాలు లేక పత్తి పీక పోతున్నారు. బంగారు తెలంగాణ నీ అప్పుల తెలంగాణ …ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారు. బడి గుడి కన్నా తెలంగాణలో మద్యం షాపులు ఎక్కవ.కమీషన్ల కోసమే తెలంగాణ లో కేసీఆర్ పరిపాలన.
మన రాష్ట్రం లో రైతులు,నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ దేశాలు ఏలబోతాడు అంట. ఈ దరిద్రం ఇక్కడితో సరిపోదు అని దేశాలు ఏలబోతరా? ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి. ప్రతిపక్షాలు భాధ్యత మరిచి పోవడం తోనే కేసీఆర్ ఆడింది ఆట..పడింది పాట. అందుకే పార్టీ పెట్టా…ప్రజల పక్షాన నిలబడత. పార్టీ కొత్త కావొచ్చు… కానీ మా పార్టీ లో వైఎస్సార్ ఉన్నాడు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే వైఎస్సార్ పాలన తెస్తుంది. ఆయన రక్తం నాలో ఉంది. మాట మీద నిలబడే వ్యక్తిగా చెప్తున్న. మీరు ఆశీర్వదించండి… ఆరోగ్య శ్రీ.. రుణమాఫీ.. ఫీజ్ రియంబర్స్మెంట్.. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పెన్షన్లు. కేసీఆర్ అక్రమ పాలన పోవాలి…వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి.