Suryaa.co.in

Telangana

షర్మిల మోడీకి ఏజెంట్

-మైనారిటీ వ్యతిరేకి అయిన మోడీ తో షర్మిల చేతులు కలిపింది
-వైఎస్‌ తన జీవితాంతం బీజేపీ, ఆర్.ఎస్‌.ఎస్‌ లకు వ్యతిరేకంగా పోరాడారు
– టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేఎల్విస్ స్టీఫెన్ సన్

వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల ప్రధాని మోదీ-బీజేపీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, స్టీఫెన్సెన్‌ ఆరోపించారు. తన జీవితాంతం బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌తో యుద్ధం చేసిన వైఎస్‌ కూతురని చెప్పుకునే అర్హత షర్మిలకు లేదని స్పష్టం చేశారు. ఇంకా రాజేశ్వరరావు ఏమన్నారంటే.. షర్మిల తెలంగాణ లో ఉంటూ మోడీ కి ఏజెంట్ గా పని చేస్తున్నారు. బీజేపీ తో షర్మిల చీకటి ఒప్పందం చేసుకుంది.

తెలంగాణ లో అల్లకల్లోలం చేసే కుట్ర షర్మిలది. షర్మిల పాదయాత్ర కు బీజేపీ జనాలను సమీకరిస్తోంది. నర్సంపేట ఘటన పై షర్మిల డ్రామా చేస్తోంది.. ఈ ఘటనను రాజకీయం చేస్తోంది. షర్మిల మాట్లాడేవన్నీ అబద్ధాలే.మైనారిటీ వ్యతిరేకి అయిన మోడీ తో షర్మిల చేతులు కలిపింది.

వైఎస్‌.ఆర్ బిడ్డ అని చెప్పుకునే అర్హత షర్మిల కు లేదు.ysr తన జీవితాంతం బీజేపీ, ఆర్.ఎస్‌.ఎస్‌  లకు వ్యతిరేకంగా పోరాడారు. అదే బీజేపీ ఆర్.ఎస్‌.ఎస్‌ లతో షర్మిల చేతులు కలిపి పని చేస్తోంది.షర్మిల చెప్పేది వైఎస్‌ ఎజెండా.. అమలు చేసేది బీజేపీ ఎజెండా. వేలాది మైనారిటీ సంస్థలను మూసి వేసింది మోడీ ప్రభుత్వం. అలాంటి మోడీ తో మైనారిటీ అయి షర్మిల ఎలా చేతులు కలువుతుంది?

మోడీ క్రైస్తవుల వ్యతిరేకి. మోడీ దేశం లో మైనార్టీలను లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు.కేసీఆర్ పాలన పై షర్మిల వి అడ్డగోలు విమర్శలు.మైనారిటీ లు కేసీఆర్ పాలన లో సురక్షితంగా ఉన్నారు.అన్ని మతాలను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.కేసీఆర్ ను విమర్శించే హక్కు షర్మిల కు లేదు..షర్మిల తీరును మేము ముక్త కంఠం తో ఖండిస్తున్నాం. కేసీఆర్ ఎజెండా దేశమంతా అమలు కావాలంటే బీ ఆర్ ఎస్ రావాలి.దళిత క్రైస్తవుల కు రిజర్వేషన్ల పై రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను మోడీ ప్రభుత్వం వ్యతిరేకించడం దుర్మార్గం.ఎక్కడ్నుంచో వచ్చి తెలంగాణ ను అల్లకల్లోలం చేయడం షర్మిల కు తగునా?

ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ఏమన్నారంటే.. తెలంగాణ కేసీఆర్ సారథ్యం లో శాంతి యుతంగా ఉంది.కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి.2014 కు ముందు తెలంగాణ లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది.తెలంగాణ లో శాంతి ఉండబట్టే అభివృద్ధి జరుగుతోంది.తెలంగాణ శాంతి యుత వాతావరణాన్ని చెడగొట్టాలని షర్మిల ప్రయత్నించడం సరి కాదు.తెలంగాణ అభివృద్ధిని వేరే రాష్ట్రాలతో పోల్చుకుని షర్మిల మాట్లాడాలి.

అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ను షర్మిల ఇష్టమొచ్చినట్టు తిట్టడం మంచిది కాదు.కేసీఆర్ ను తిట్టడం ద్వారా షర్మిల తెలంగాణా ప్రజల ను అవమానిస్తున్నారు.కేసీఆర్ పై అర్ధం లేని విమర్శలు చేయడం షర్మిల ఆపితే మంచిది. షర్మిల తిట్ల రాజకీయం ఆమెకు మంచిది కాదు.

LEAVE A RESPONSE