Suryaa.co.in

Andhra Pradesh

డీకే శివకుమార్ తో షర్మిల భేటీ

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. బెంగళూరులోని ఆయన నివాసానికి చేరుకున్న షర్మిల ఈ నెల 8న తన తండ్రి, ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. షర్మిల ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహను సైతం ఆహ్వానించారు.

LEAVE A RESPONSE