దూపైనప్పుడు బాయి తవ్వుకునుడు… చేతులు కాలాక ఆకులు పట్టుకొనుడు…

– సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిపోయి ఢీల్లీల రాజకీయాలు చేస్తున్నడు దొర
– వరదలు వచ్చినప్పుడు,జనం కొట్టుకుపోయి చచ్చినప్పుడే దొర నిద్ర లేస్తాడు
– మాటలు చెప్పుడే కానీ చేతలు మాత్రం ఉండవు
– కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల వ్యంగ్యాస్త్రాలు

వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. భారీ వరదల్లో ప్రజలు కట్టుబట్టలతో నిరాశ్రయులవడానికి కేసీఆర్‌ ముందుచూపు లోపమే కారణమని ధ్వజమెత్తారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో సర్కారు విఫలమయిందన్నారు. విపత్తు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప, వాటిని ఊహించి ముందస్తు చర్యలు తీసుకోవడం చేతకాని కేసీఆర్‌కు, ఆ పదవి ఎందుకని విరుచుకుపడ్డారు.

షర్మిల ఏమన్నారంటే… ఓ వైపు వర్షాలతో మూసీ ఉప్పొంగి పరివాహక ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఏటా వర్షాలకు ఇదే పరిస్థితి చుడాల్సి వస్తుంది. మూసీ వరదలకు ఇళ్ళు మునిగి పోతున్నా ముందస్తు చర్యలు ఉండవు.వరదలు వచ్చినప్పుడు,జనం కొట్టుకుపోయి చచ్చినప్పుడే దొర నిద్ర లేస్తాడు.మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామంటూ హడావిడి చేస్తాడు. తీరా మాటలు చెప్పుడే కానీ చేతలు మాత్రం ఉండవు. వర్షాలు వరదలతో రాష్ట్రం అతలాకుతలం అయింది.ఇంకా సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిపోయి ఢీల్లీల రాజకీయాలు చేస్తున్నడు దొర. రాష్ట్రంలో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోతే మాకెందుకు అనుకుంటున్నారా? జనం చచ్చినా పర్వాలేదు. మీకు మీ రాజకీయాలే ముఖ్యం.

Leave a Reply