– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజక వర్గం బూర్గంపాడు మండలం, ఇరవండి గ్రామంలో రైతు గోస దీక్ష లో పాల్గొన్న వైఎస్ షర్మిల
పోడు భూముల సమస్య పరిష్కరించాలని కేసీఆర్ కి చిత్తశుద్ది లేదు. పట్టాలు ఇవ్వక పోగా ఉన్న వాటికి లాక్కున్నారు. రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? రుణమాఫీ అని చెప్పి ఎంత మందికి రుణాలు మాఫీ చేశారు కేసీఆర్ గారు?
రుణాలు మాఫీ చేస్తే కదా..కొత్తగా బ్యాంకులు రుణాలు ఇచ్చేది. వరి రైతులకు కేసీఆర్ నిండా మోసం చేశారు. తప్పుడు సంతకం పెట్టి యాసంగిలో రైతులను నిండా ముంచారు.తప్పు కేసీఆర్ చేస్తే ఈ రోజు శిక్ష రైతులకు పడింది. 17 లక్షల ఎకరాల్లో వరి వేయని రైతుకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలి. 35 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యాన్ని సైతం కొనడం లేదు.
8 వేల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి వెయ్యి కూడా తెరవలేదు. కేసీఆర్ రైతులను ఏ రకంగా ఆదుకున్నారో ఒక్కటి చూపించాలి. రైతులను ఆదుకొని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది. కౌలు రైతుకు వ్యవసాయం తప్పా మరొకటి తెలియదు. కౌలు రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రైతు కూలీలకు..వారి జీవితాలకు భరోసా లేనే లేదు.
తెలంగాణ లో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. ప్రతిపక్షాలు ప్రశ్నించక పోవడం తోనే కేసీఆర్ అరాచకాలు.. కాంగ్రెస్ లో గెలిచి ఎమ్మెల్యే లు టీఆరెఎస్ లో చేరుతున్నారు. ప్రతిపక్షాలు భాధ్యత మరిచిపోవడం తోనే పార్టీ పెట్టా. వైఎస్సార్ సుపరిపాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే వైఎస్సార్ బిడ్డగా పని చేస్తానని మాట ఇస్తున్న.