– టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ షర్మిల ఇటీవల సీబీఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఏబీఎన్ ఛానల్‌లో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు షర్మిల ఢిల్లీ వెళ్ళారని ఆయన అన్నారు. ఆమె నుంచి ఫిర్యాదులు తీసుకున్న సీబీఐ అధికారులు.. వివేకా హత్యకేసులో వాంగ్మూలం ఇస్తారా అని అడిగినట్లు తమకు సమాచారం ఉందని రవి అన్నారు. దానికి అంగీకరించిన షర్మిల సీబీఐ వద్ద వాంగ్మూలం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తనకు అందిన సమాచారం మేరకు షర్మిల వాంగ్మూలంలోని కీలక అంశాలను రవి వివరించారు. వివేకా ఏమన్నారంటే.. ”కడప ఎంపీ సీటు నుంచి తనను పోటీ చేయమని వివేకా కోరారు. జగన్‌తో మాట్లాడుతానని.. జగన్ కోరినపుడు వొద్దని చెప్పొదని తనతో వివేకా అన్నారు. దానికి తాను సరే అని చెప్పాన”ని షర్మిల సీబీఐకి చెప్పినట్లు తనకు సమాచారం ఉందని బీటెక్ రవి అన్నారు. సీబీఐ కేసు దర్యాప్తు దాదాపు పూర్తి కావొచ్చిందని.. ఈ కేసులో ప్రధాన సూత్రధారులను అరెస్ట్ చేయడం కేవలం రాజకీయ నిర్ణయమని బీటెక్ రవి అన్నారు.