Suryaa.co.in

Andhra Pradesh

నరసరావుపేటలో వైసీపీకి షాక్‌

-టీడీపీలోకి కపిలవాయి విజయ్‌కుమార్‌, న్యాయవాది చిన్నప్పరెడ్డి
-చంద్రబాబు సమక్షంలో చేరిక

నరసరావుపేటలో వైసీపీ షాక్‌ తగిలింది. రాష్ట్ర గోల్డ్‌ బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కపిలవాయి విజయ్‌కుమార్‌, న్యాయవాది చిన్నప్పరెడ్డి శనివారం ఆ పార్టీని వీడి టీడీపీ జెండా కప్పుకున్నారు. క్రోసూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వారు చేరారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చదలవాడ అరవింద బాబు వారి వెంట ఉన్నారు.

LEAVE A RESPONSE