– ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించడంలో ఆంతర్యం ఏమిటి?
– కమిటీ రద్దు చేయాలి
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ పై ఆరుగురు సభ్యులతో కమిటీ వేస్తే, ఆ కమిటీకి మా ఎస్సీ నాయకులు, మంత్రి దామోదర రాజనర్సింహ ని కమిటీ చైర్మన్ గా నియమించకపోవడం దారుణం. ఎస్సీ వర్గాల సమస్యలు తెలిసిన నాయకుడిని కాకుండా, ఉన్నత వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించడంలో మీ ఆంతర్యం ఏమిటి?
ఒక రెడ్డి కులస్తుడు చైర్మెన్ గా ఉన్న ఈ కమిటీ వల్ల, మాకు ఏం ప్రయోజనం జరుగుతుంది? ఎస్సీ వర్గాల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి? వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ చైర్మన్ వెంటనే మార్చాలి. మాదిగ నాయకుడు నే చేర్మన్ గా వేయాలి. ఈ కమిటీ రద్దు చేయాలి.