అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలవగా… పెట్రో ధరలపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని అందజేసింది. కాగా టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సాంప్రదాయాలు నాకు తెలుసు… మీరు చెప్పినట్లు నేను సభ నడపాలా’’ అంటూ స్పీకర్ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించారు. దేశంలో ఎక్కడా లేనంత పెట్రో భారం రాష్ట్ర ప్రజలపై ఉందని టీడీపీ స్లొగన్స్ వినిపించారు. కాగా సంతాప తీర్మానాలు అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు.