– మీడియాతో మాట్లాడటంపై ప్రభుత్వం అభ్యంతరం
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతనెల 21న ఏబీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం తప్పేనంటూ ఆయనకు మెమో జారీ చేసింది. ఏబీవీ ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించలేదని నోటీసులో పేర్కొంది. మెమో అందిన వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. లేనిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఆయన్ను హెచ్చరించింది. ఏబీవీ మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ సీఎస్ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. మార్చి 31న ఏబీవీ మీడియా సమావేశంలో పెగాసస్‌తోపాటుగా తన సస్పెన్షన్ అంశాలపై మాట్లాడారు.