జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర రైతాంగం చితికిపోయింది

• ఆదుకునే వారు లేక అన్నదాత అల్లాడిపోతున్నాడు
• కౌలు రైతుల కష్టాలు పట్టించుకునే వారు లేరు… కొత్త చట్టంతో కౌలు రైతుల హక్కులు తీసేశారు
• నాటి చట్టాన్ని అద్భుతమన్న కన్నబాబు.. నేడు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు
• తూర్పు గోదావరిలో 41 మందిలో 8 మందికే సాయం అందింది
• ప్రభుత్వ విధానాలతో ఎన్నో రైతు కుటుంబాలు వీధినపడ్డాయి
• రైతుల కష్టాలు తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్  స్పందించారు
• ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించారు
• ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు
• 12వ తేదీ అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం
• వైసీపీ ప్రభుత్వానికి ఈసారి ప్రజలు ఓటేయరు
• ప్రజల పక్షాన పోరాటానికి జనసేన శ్రేణులు సిద్ధం కావాలి
• జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా చితికిపోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన  నాదెండ్ల మనోహర్  స్పష్టం చేశారు. ఆదుకునే వారు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారన్నారు.కౌలు రైతులను పట్టించుకునే నాధుడు లేడనీ, ఈ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా అంతా బాగుందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక వింత
చట్టాలు తీసుకువచ్చి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలను దూరం చేశారని తెలిపారు. కౌలు రైతుల కష్టాల తెలుసుకున్న వెంటనే  పవన్ కళ్యాణ్  అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. మనం ఎన్నికల గురించి ఆలోచించకుండా కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకుందామని చెప్పారు. జనసేన పార్టీ తరఫున ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోబోతున్నామని తెలిపారు. ఈ నెల 12వ తేదీన  పవన్ కళ్యాణ్  అనంతపురం జిల్లాలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి ఆర్ధిక సాయం చేయబోతున్నామని చెప్పారు. మంగళవారం
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ,ఈ రాష్ట్రంలో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. సంక్షేమం పేరిట మభ్యపెడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి బ్యాంకుల చేత కూడా తిట్టించుకునే స్థితికి వచ్చారు. 2011లో కౌలు రైతుల కోసం భూమి లైసెన్స్ పొందిన వ్యవసాయదారు చట్టం పేరిట అద్భుతమైన బిల్లు నాటి ప్రభుత్వం తీసుకువచ్చారు. కౌలు రైతులను ఎవరూ ఆదుకోవడం లేదన్న ఉద్దేశంతో చట్టంలో మార్పులు తెచ్చి వారికి సీసీఆర్సీ కార్డులు తీసుకువచ్చి అందరికీ ఐడీ కార్డులు ఇచ్చాం. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 16 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఆనాడు తీసుకువచ్చిన చట్టం 20 ఏళ్ల పాటు వివిధ రూపాల్లో రైతులకు ఉపయోగపడింది.

ఈ చట్టం ద్వారా కౌలు రైతులకు విత్తనాలు, యూరియా తదితర సౌకర్యాలు కల్పించారు.ముద్దులు పెట్టుకుంటూ రోడ్ల వెంట పాదయాత్రలు చేసిన ఈ వింత ముఖ్యమంత్రి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చట్టం తీసుకువచ్చారు. అధికారులు వద్దు అంటున్నా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నా దగ్గరే ఎక్కువ సమాచారం ఉంది.. మీకేం తెలియదని అధికారుల మాట వినలేదు. సీసీఆర్సీ కార్డులు తెచ్చి భూ యజయానితో రెంటల్ అగ్రిమెంట్,సంతకం తప్పనిసరి చేశారు. గ్రామాల్లో చిన్న చిన్న రైతు కుటుంబాలు భయపడి సంతకాలు చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 17 లక్షల మంది కౌలు రైతులు ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం 5 లక్షల మందికే ఆ కార్డులు ఇవ్వాలని ముందస్తు
టార్గెట్లు పెట్టుకుంది.

•  కన్నబాబుకి ఛాలెంజ్ చేస్తున్నాం…
వ్యవసాయ మంత్రి  కన్నబాబు తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని చెబుతారు.2011లో నాటి చట్టం తెచ్చినప్పుడు ఇదే కన్నబాబు  అద్భుత చట్టమని పొగిడారు. పది నిమిషాలు మాట్లాడి సంచలనాత్మక నిర్ణయం అని పొగిడారు. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయి 2019లో జగన్ తెచ్చిన లోపభూయిష్ట చట్టం గురించి పొగుడుతున్నారు. కౌలు రైతుల సమస్యలపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్  మీద విమర్శలు చేస్తున్నారు.

రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అన్నపూర్ణ లాంటి ఉభయగోదావరి జిల్లాల్లో 87 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 41 మంది చనిపోతే ప్రభుత్వం ఆర్ధిక సాయం చేసింది 8 మందికి మాత్రమే.

రైతులను ఆదుకుంటామని కొత్త జీవో తెచ్చారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ. 7లక్షలు సాయం చేస్తామన్నారు. సాయం చేస్తామని చెప్పి మాట తప్పారు. క్షేత్ర స్థాయిలో రైతుల ఇబ్బందులపై రైతు స్వరాజ్య వేదిక అనే సంస్థ 18 గ్రామాల్లో పర్యటించి 700 మంది రైతులను కలసి ఒక నివేదిక రూపొందించింది. దాన్ని పవన్ కళ్యాణ్ కి అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించాం.

* బిడ్డల చదువులు మాన్పించారు
మా పర్యటనలో చాలా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైతు ఆత్మహత్యకు పాల్పడి 9 నెలలు గడచినా ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదు. ఎవ్వరూ ఆదుకోలేదు. ప్రభుత్వం నుంచి రూ. 7 లక్షల పరిహారం వస్తుందని కూడా ఎవ్వరూ చెప్పలేదు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ప్రకారం త్రీ మ్యాన్ కమిటీ పరిహారం అందచేయడంతో పాటు అప్పులు ఇచ్చిన వాళ్లను పిలిచి వన్ టైమ్ సెటిల్మెంట్ చేయాలి. కానీ అది జరగలేదు. ఓ రైతు భార్య ఆదుకునే దిక్కులేక పిల్లల్ని చదువులు మాన్పించే పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును అధికారులు వదిలేశారు. మరో రైతు ఆత్మహత్యకు పాల్పడితే వైఎస్సార్ బీమా కింద రెండు లక్షల పరిహారం ఇప్పిస్తామని చెప్ప నమ్మబలికారు. ఇలా ఎన్నో కుటుంబాలు సాయం అందక వీధిన పడే పరిస్థితి.

మంత్రి  కన్నబాబుకి సవాలు చేస్తున్నా… మీకు చిత్తశుద్ది ఉంటే ఎంత మందికి సాయం చేశారో చెప్పండి. జనసేన పార్టీ తరఫున జిల్లా ఎస్పీ  నుంచి సమాచారం తెప్పించుకుని పవన్ కళ్యాణ్ కి అందచేశాం. వెంటనే ఆయన స్పందించారు రైతులు కన్నీరు పెట్టరాదు అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి రూ. లక్ష సాయం చేయాలని నిర్ణయించారు. జనసేన పార్టీ తరఫున ప్రతి కుటుంబాన్ని
ఆదుకోబోతున్నట్టు చెప్పారు.

• జగన్ రెడ్డి మాట తప్పారు.. మడమ తిప్పారు
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 1019 మంది, రెండో ఏడాది 889 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్సీఆర్బీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెడుతోంది. మా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు కర్నూలు జిల్లాలో 353 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అనంతపురం జిల్లాలో 170 మంది, ప్రకాశంలో 49 మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 87 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎన్నికల ముందు పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు బయటకు రావడం లేదు. మాట తప్పారు.. మడమ తిప్పారు.. పవన్ కళ్యాణ్  ప్రతి రైతు కుటుంబానికి రూ. లక్ష ప్రకటించారు.పార్టీ నాయకులు ఆత్మహత్య చేసుకున్న రైతుల సమాచారాన్ని పరిశీలించండి. పవన్ కళ్యాణ్  ఆయా జిల్లాల్లో నేరుగా పర్యటించి సాయం అందిస్తారు.

• సమాజం కోసం నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ 
పవన్ కళ్యాణ్  నిరంతరం సమాజం కోసం నిలబడే వ్యక్తి. ఆయన అనేక సంస్థలకు విరాళాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎంతో మందికి స్ఫూర్తిని నింపిన దామోదరం సంజీవయ్య స్మారకానికి రూ. కోటి విరాళం ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామ అభివృద్ధికి రూ. 50 లక్షలు ఇచ్చారు.  పవన్ కళ్యాణ్  సాయాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆసుపత్రి కట్టుకుంటామని ఇప్పటం
pavan1 ప్రజలు చెబుతున్నారు. ఆయన చేసిన సాయానికి పదే పదే ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ రోజున
తీసుకున్న నిర్ణయం ఇంకా పెద్దది. రైతులకు సాయం అందించడం గొప్ప విషయం. చమటోడ్చి
సినిమాలు చేసి సంపాదించిన డబ్బుతో సాయం చేయడం పవన్ కళ్యాణ్  గొప్పతనం.పార్టీ నడపడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో నిబద్దత ఉండాలి. నాయకులు కూడా పార్టీ కోసం ఏం చేస్తున్నామనేది ఆలోచించుకోండి.

• రైతుకి కులాన్ని అంటగట్టారు
రైతు కుటుంబాలను పరామర్శించినప్పుడు తెలిసిన మరో ముఖ్యమైన అంశం రైతుకి అందించే సాయానికి కులాన్ని అంటగట్టడం. రైతుకి కులంతో ఏం సంబంధం? పది మందిని ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న రైతుకి కులాన్ని ఈ ప్రభుత్వం కులాన్ని ఆపాదించింది. రైతు భరోసా పథకం ఓసీ రైతులకు వర్తించదట. రాష్ట్రంలో 90 శాతం మంది రైతుల తక్కువ కమతాల్లో వ్యవసాయం చేసే వారే. ఈ ప్రభుత్వం ఓసీ కేటగిరీలో ఉన్న వారు అర్హులు కాదు అంటూ జీవో జారీ చేసేసింది. వారేం తప్పు చేశారు. కోస్తా ప్రాంతంలో ఉన్నవారంతా చిన్న సన్నకారు రైతులే. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం రాదు. విత్తనాలు రావు. ఎరువులు రావు.

• మళ్లీ పాదయాత్ర చేస్తే రైతు సెగ తప్పదు
ఈ ప్రభుత్వం మీద రైతులు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు.  జగన్ రెడ్డి ఇంకోసారి పాదయాత్ర చేస్తే వెళ్లిన ప్రతి చోట రైతులు నిరసన తెలుపుతారు. తీరా ఎన్నో కష్టాలు పడి రైతులు పంటలు పండిస్తే ఈ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై బస్తా రూ. 700కు కొనుగోలు చేసి రూ. 1400కు అమ్ముకున్నారు. నివార్ తుఫాను వచ్చి రైతులు నష్టపోతే జనసేన పార్టీ తరఫున ఎకరాకి కనీసం రూ. 25 వేల సాయం అందిచమని ధర్నాలు చేశాం. ఈ ముఖ్యమంత్రి మనసు కరిగి సాయం అందిస్తాడని భావించాం. స్పందించకపోగా 17 లక్షల మంది కౌలు రైతుల్లో 5 లక్షల మందికి కార్డులు అందించే విపరీతమైన ప్రయత్నం చేశారు. ప్రతి గ్రామంలో నష్టపోయిన రైతాంగం ఉన్నారు. ప్రతి జిల్లాలో ఉన్నారు. పార్టీ నాయకులు వారి పక్షాన
బలంగా నిలబడాలి. ఇదే బలమైన సమస్య.

వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఇంకోసారి ఓటు వేయరు. ప్రజలు సిద్ధమైపోయారు. మనం ప్రజల
పక్షాన నిలబడి ఉద్యమించేందుకు సిద్ధమవ్వాలి. ఎటువంటి సమస్య పైనైనా, ఏ
పరిస్థితుల్లో అయినా సమస్య గురించి బలంగా మాట్లాడే వ్యక్తి  పవన్ కళ్యాణ్.

• ఏడాది పట్టుదలతో పని చేయండి
ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమస్య గురించి బలంగా మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ . విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో వచ్చే నెలలో బిల్లులు వచ్చినప్పుడు అర్ధం అవుతుంది. ప్రతి కుటుంబానికీ రూ. 500 బిల్లు ఎక్కువ వచ్చే పరిస్థితి. అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ నెల 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపాము. ఈ కార్యక్రమాన్ని లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రతి మండలంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టండి. పార్టీ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా మీకు ఆ సమాచారం అందుతుంది. ఒక్క సంవత్సరం మనం పట్టుదలతో పని చేసి పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ల గలిగితే  జగన్
రెడ్డికి బుద్ది చెప్పేలా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. 2024లో జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది.

• కొత్త జిల్లాలు పట్టించుకోవద్దు
పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలలో నేతల పని తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన జిల్లాలను పట్టించుకోవద్దు. పాత జిల్లాలనే ఫాలో అవ్వండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, పదవుల కోసమే జిల్లాల పునర్విభజన చేపట్టింది. పార్టీ క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కరోనా కష్టకాలంలో కూడా తొలి విడత లక్ష సభ్యత్వాలు చేశాం. ఈ ఏడాది మూడు లక్షల పైచిలుకు
సభ్యత్వాలు పూర్తయ్యాయి. త్వరలో పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు ప్రారంభిస్తారు అని అన్నారు.

• జనసేన రాజకీయ తీర్మానాలకు ఆమోదం
జనసేన పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అయిదు తీర్మానాలను ఈ సందర్భంగా చదివారు. విశాఖ ఉక్కు పరిరక్షణ, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, పెట్రోలు ధర పెంపు,రైతుల కష్టాలు, మహిళల రక్షణ అంశాలపై చేసిన తీర్మానాలకు విస్తృత స్థాయి సమావేశం ముక్తకంఠంతో ఆమోదం తెలిపింది.

* వైసీపీ నాయకులకు షార్ట్ టైమ్ మెమరీ లాస్ ఉంది:  నాగబాబు 
పార్టీ పీఏసీ సభ్యులు  నాగబాబు మాట్లాడుతూ,వైసీపీ నాయకులు షార్ట్ టైమ్ మెమరీ లాస్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. ఎవరికీ ఈ రోజు చెప్పిన మాట రేపటికి గుర్తుండడం లేదు. ఈ రోజు చెప్పింది రేపు చెప్పరు. ఏడాది తర్వాత అయితే మేము అనలేదే అనేస్తున్నారు. అదేమంటే మేము అన్నామా అని బుకాయిస్తారు. మా మీద విరుచుకుపడతారు.

జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితుల గురించి అవగాహన వచ్చింది. కట్ చేస్తే శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి ఒక పెద్ద అబద్దం చెప్పారు. అవన్నీ సహజ మరణాలు అని. సహజ మరణాలు అంటే అంతా మగవాళ్లు, కొంచం మద్యం సేవించే వారు, ఒకే ప్రాంతం వారు చనిపోతారని మాకు తెలియదు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తే వారి ఇళ్లకు అధికారులను పంపి సహజ మరణాలు అని చెప్పాలని బెదిరిస్తున్న విషయం తెలిసింది. అలాంటిది శాసనసభలో వాటిని సహజ మరణాలు అని చెబుతుంటే బాధ కలిగింది.

మన అధ్యక్షుల వారి ఆలోచనలు చూస్తే మన ఆలోచనలు ఆగిపోయిన చోట ఆయన ఆలోచనలు
మొదలవుతాయి. కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఏమీ
చేయలేం. సమస్య తెలిసిన వెంటనే వారికి ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాలని మా అధ్యక్షులు చేసిన ఆలోచన పట్ల గర్విస్తున్నాం. ఆ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. ఆయన నా సోదరుడు కావడం వల్ల ఎక్కవ మాట్లాడలేకపోతున్నాను. ఈ వేదిక నుంచి అందరికీ ఒక్కటే చెబుతున్నా భవిష్యత్ తరాలు మాత్రం పవన్ కళ్యాణ్ వంటి గొప్ప నాయకుడి దగ్గర పని చేశామని గర్వపడతాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు ఒక సమాచారం ఉంది. ప్రతి పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్ధులు ఎన్నికల్లో గెలుపు కోసం కోట్లు ఖర్చు పెడతారు. అలాంటిది ఇటువంటి సమయంలో ఆ కోట్ల రూపాయిలు ఎందుకు తీయరు?రైతుల్ని ఎందుకు ఆదుకోరు?  పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కోసం చేసే ఈ యజ్ఞంకోసం నా వైపు నుంచి రూ. 10 లక్షలు పార్టీకి అందచేస్తానని అన్నారు.
ఈ సమావేశంలో పీఏసీ సభ్యులు కోన తాతారావు, ముత్తాశశిధర్,  పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు  పి. శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ,  చిలకం మధుసూదన్ రెడ్డి,  బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెదపూడి విజయ్ కుమార్, జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్, గాదె వెంకటేశ్వరరావు,  షేక్ రియాజ్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, నియోజక వర్గం ఇంచార్జులు, వీర మహిళ ప్రాంతీయ కో
ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

• పార్టీకి రూ. 5 కోట్ల విరాళం
జనసేన పార్టీ తరఫున చేపట్టిన రైతులను ఆదుకునే కార్యక్రమం కోసం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తనవంతుగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నంకి అందచేశారు.

Leave a Reply