Home » సైలెంట్ ఓటింగ్

సైలెంట్ ఓటింగ్

– జగన్ అంటే అభిమానం కన్నా భయం ఎక్కువ

గత ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ తక్కువ. తాము ఎవరికి ఓటు వేస్తాం అనేది ప్రీ పోల్ సర్వే…  ఎవరికి ఓటు వేశాం అని చెప్పేది పోస్ట్ పోల్ సర్వే. పోలింగ్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు అనో ఇరు పార్టీలు ఇచ్చే డబ్బు కోసమో కొంత సైలెంట్ అవుతుంటారు. పోలింగ్ తర్వాత ఓపెన్ అవుతుంటారు.

ఈ ఎన్నికల్లో ఎపుడూ లేని విధంగా వివిధ సర్వే సంస్థలు సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉంది అని చెబుతున్నాయి. గత ఎన్నికల్లో 50% ఉంటే ఈ ఎన్నికల్లో 85% ఉంది అని సర్వే సంస్థల లెక్కలు. ఈ సైలెంట్ ఓటింగ్ ఎటు అనే అంశం చూస్తే భయం ప్రధాన కారణం అనుకోవచ్చు. జగన్ ఇచ్చే డబ్బు ద్వారా లబ్ది పొందాం వేస్తాం అని చెప్పడానికి భయం అవసరం లేదు. కానీ జగన్ అంటే అభిమానం కన్నా భయం ఎక్కువ వర్గాల్లో ఉంది. కొన్ని వర్గాల్లో బానిసత్వం ఉంది. బానిసత్వం ఉన్నవారు నిర్భయంగా తమ అభిప్రాయం చెబుతారు.‌

జగన్ పాలన ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైంది. బాబు ఇంటిని కూలిస్తే దిక్కు లేదు ప్రాధమిక ఆధారాలు లేకుండా బాబుని అరెస్టు చేస్తే దిక్కు లేదు. ఎపుడూ లేని విధంగా న్యాయమూర్తులను కూడా వదల్లేదు వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి మాజోలికొస్తే మాకు ఎవరైనా అంతే అనే సందేశం పంపారు. సొంత చెల్లెలు జగన్ పై వ్యతిరేకంగా మాట్లాడితే వారీ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అంటే వారి వైఖరి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వారి పరిస్థితే ఇలా ఉంటే మనం ఎంత అనే ఒక భయం జనంలో కలిగించారు. ఆ సంకేతం జనంలోకి పంపడంలో జగన్ & కో సూపర్ సక్సెస్.

బాబు హయాంలో ఉద్యమాలు జరిగినప్పుడు కూడా కేసులు పెట్టారు అలా అని ఒక హోదా కోసం అయినా రిజర్వేషన్లు కోసం అయినా ఉద్యమాలు ఆపలేదు. బాబు హయాంలో ఉద్యమాలు చేసిన ఉద్యమ నేతలు జగన్ హయాంలో ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. రాయలసీమ ఉద్యమ నేతల సంగతి సరేసరి. బాబు హయాంలో ఒక్క పద్మావతి మెడికల్ కాలేజీలో సీట్లు నాన్ లోకల్ వివాదం చేస్తే ఉద్యమం చేశారు.

ఇపుడు ప్రతి కొత్త మెడికల్ కాలేజీలో సగం సీట్లు పేదవారికి అందుబాటులో లేకుండా చేస్తే నోరెత్తేవారు లేరు. అన్నమయ్య ప్రాజెక్టు ఆనవాళ్లు లేకుండా కొట్టుకు పోయింది ఫింఛా ప్రాజెక్టు మట్టి కట్ట కొట్టుకుపోయింది ఇది బాబు హయాంలో గనక జరిగి ఉంటే ఉద్యమ నేతలకు పూనకాలు వచ్చి ఉండేవి. బాబు హయాంలో గనక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే దళిత నేతలు హోరెత్తించే వారు. బాబు హయాంలో రిజర్వేషన్లు కోసం పళ్ళెం గరిట పట్టిన ముద్రగడ జగన్ వచ్చాక రిజర్వేషన్లు ఎత్తేస్తే రాజకీయ సన్యాసం ప్రకటించారు. అన్నింటికీ కారణం నేతల్లో బానిసత్వం జనంలో భయం అయి ఉండాలి.

ఈ భయంతోనే సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉంది. ఇది ఖచ్చితంగా జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా ఉంటుంది అని భావిస్తున్నా. సైలెంట్ ఓటింగ్ వయొలెంట్ గా ఉండొచ్చు జూన్ 4 ఊహించని రీతిలో బ్యాలెట్ బాక్సులు బద్దలు అవ్వొచ్చు అని నమ్ముతున్నా.

– ప్రసాద్

Leave a Reply