-అధ్యక్షుడు, ప్రధాని బాబుకు తెలిసిన వారే
-గెలుపునకు ముందే మొదలైన చర్చ
సింగపూర్ ప్రధానిగా నిన్న లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం చేయడం, ఇప్పటికే అధ్యక్షుడిగా ధర్మన్ షణ్ముగ రత్నం ఉండటంతో అమరావతి రాజధాని అభివృద్ధి పై చర్చ జరుగుతోంది. గతంలో లారెన్స్ వాంగ్ సింగపూర్ నేషనల్ డెవెలప్‌మెం ట్ మినిస్టర్‌గా చంద్రబాబును కలిసి వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో చర్చించుకున్నారు. అప్పట్లో ఉప ప్రధానిగా ఉన్న ధర్మన్ షణ్ముగ రత్నం కూడా చంద్రబాబును కలి సే వారు. ఆయన ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షుడు. చంద్రబాబుతో పరిచయం, స్నేహితులుగా ఉన్న ఇద్దరూ దేశ ప్రధాని, అధ్యక్షులుగా ఉండటంతో కూటమి గెలుపు తర్వాత అమరావతికి తిరిగి సహకారం అందే సంకేతాలు కనిపిస్తున్నా యి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు సామెత లెక్క అన్నీ శుభపరిణామాలే ఎదురవుతున్నాయి.