మనం ప్రాణదానం చేసి విముక్తి కల్పించిన బంగ్లాదేశ్లో ఇప్పుడు మళ్లీ భారతదేశానికి వ్యతిరేకంగా విషపు విత్తనాలు నాటుతున్నారు. ఫిబ్రవరిలో జరగబోయే బంగ్లాదేశ్ ఎన్నికలు, షేక్ హసీనా నిషేధం తర్వాత, భారత జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన మలుపు కానున్నాయి.
‘గ్రేటర్ బంగ్లాదేశ్’ అనే ప్రమాదకరమైన కల… భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర భూభాగాలను కలిపి ఏర్పాటు చేయాలని విస్తరణవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ప్రచారకర్త అయిన షరీఫ్ ఉస్మాన్ హదిపై ఢాకా వీధుల్లో కాల్పుల దాడి జరిగింది. ఈ దాడిని ఇప్పుడు BNP మరియు దాని మిత్రపక్షాలైన జమాతే ఇస్లామీ రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నాయి. వారు హదిని ‘బలిపశువుగా’ చిత్రీకరిస్తూ, రాడికల్ మరియు భారత వ్యతిరేక శక్తుల సానుభూతిని కూడగట్టుకుంటున్నారు.
హదిని కాల్చిన అనుమానితుడు ఫైజల్ కరీం మసూద్ తలపై తాత్కాలిక ప్రభుత్వం 50 లక్షల BDT రివార్డు ప్రకటించినప్పటికీ, BNP దీన్ని ‘ఎన్నికల విధ్వంసానికి పన్నిన కుట్ర’గా ఆరోపిస్తోంది. BNP అధికారంలోకి వస్తే, ఉల్ఫా వంటి భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్ మళ్లీ స్వర్గధామం అవుతుందనే చికాకు భారతదేశ గూఢచార సంస్థలను వెంటాడుతోంది.
సరిగ్గా ఈ కీలక సమయంలో, భారత ఎన్నికల కమిషన్ యొక్క సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇది కేవలం ఎన్నికల సంస్కరణ కాదు; ఇది జాతీయ భద్రతా ఆయుధం.
ఈ సర్ కారణంగా చట్టవిరుద్ధంగా భారతదేశంలో నివసిస్తున్న వేలాది మంది అనుమానిత బంగ్లాదేశీయులు పట్టుబడతామనే భయంతో తమ వలస పత్రాలను వదిలి, సరిహద్దు దాటి వెనక్కి పారిపోతున్నారు.
సర్ ప్రక్రియ, ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ కల సాకారం కావడానికి అవసరమైన అక్రమ జనాభా స్థిరపడటాన్ని అడ్డుకుంటూ, భారతదేశ భూభాగాన్ని చట్టబద్ధంగా రక్షిస్తోంది.
బంగ్లాదేశ్లో ప్రస్తుత అస్థిరత భారతదేశానికి అత్యంత కీలకమైన భద్రతా సమస్య BNP మరియు జమాతే ఇస్లామీల భాగస్వామ్యంతో రాబోయే పాలన, హది రక్తంతో కూడిన రాడికల్ సానుభూతితో బలోపేతం అవుతోంది. ఈ పరిణామం 4,000 కిలోమీటర్ల సరిహద్దు భద్రతకు, ఈశాన్య రాష్ట్రాల స్థిరత్వానికి సవాలు విసురుతోంది. సరిహద్దుల్లోని ఈ ప్రతికూల రాజకీయ వాతావరణాన్ని, పెరుగుతున్న అక్రమ వలసలు మరియు ఉగ్రవాద పునరుద్ధరణ అవకాశాలను భారత గూఢచార సంస్థలు (RAW/IB) నిశితంగా అంచనా వేయాల్సిన తక్షణ అవసరం ఉంది.
సర్ పరిశీలన కోసం మన దేశ పౌరులు ఒక్క రోజు లేదా రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డా అది మన దేశ భద్రతకు మంచిది. ఈ విషయంలో దేశ పౌరులుగా మనం భాద్యతగా వ్యవహరించాలి.
బెంగాల్ కాదు. మన ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఎంతో మంది బంగ్లాదేశ్ జాతీయులు, ఆధార్ కూడా తీసుకొని స్థిరపడ్డారు అనేది మనం అంగీకరించాల్సిన వాస్తవం. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేకుండా సర్ కోసం మన బాధ్యతగా దేశానికి సహరించాలి.
– చాకిరేవు