దేశంలో భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని, ఏ వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండకూడదని, చనిపోయిన వారి ఓట్లు తొలగించడం తదితరాలు.
అలక్ష్యంతో, స్వార్థంతో, అన్యస్థితిలో, అసమర్ధతతో, అవినీతితో చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా, అనాదిగా రెండు మూడు చోట్ల ఓటర్ లిస్ట్ లో పేర్లు ఉన్న వారిని గుర్తించక అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాను భారత ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం స్పెషల్ ఇంటెన్సవ్ రివిజన్ (SIR) దేశమంతటా బూతుల వారీగా బిఎల్ఓ లను నియమించి వారికి భారతీయ ఎన్నికల కమిషనర్ జీతాలు చెల్లిస్తూ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా, జరగకుండా అమలయ్యేటట్లుగా మొదలుపెట్టింది.
దీనికి శుభ సూచికం రెండు నెలల క్రితం బీహార్ రాష్ట్రంలో ఎస్ ఐ ఆర్ అమలు చేస్తే ఎవరు ఊహించని విధంగా 64 లక్షల ఓట్లు బయటపడ్డ విషయం వాటిని తొలగించి పొరపాటున తొలగించిన కూడా తిరిగి నిజమైన ఓటరు అప్లై చేసుకునే విధంగాచేసి ఆ ప్రకారం ఎన్నికలు జరిగిన విషయం దేశమంతా తెలుసు.
అయితే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతో బిజెపిని, ఎన్నికల కమిషన్ను అబద్దాలతో ఆడిపోసుకోవడం, దానికి కొన్ని పార్టీలు వంత పాడడం, సుప్రీంకోర్టులో కేసులు వేసి అబాస్ పాలు కావడం మనమంతా చూస్తూనే ఉన్నాం.
కానీ బీహార్ ఎన్నికలు జరిగిన తర్వాత సర్ వల్ల ఎన్డీఏ లాభబడిందని కొంతమంది భావించారు. వాస్తవాలలోకి వద్దాం. సర్ ప్రక్రియలో భాగంగా ఎక్కువగా తక్కువగా తొలగింపు జరిగిన ఐదు నియోజకవర్గాలలో నాలుగింటిని ఎన్డీఏ గెలిచింది రికార్డ్ స్థాయిలో అత్యధిక తొలగింపులు జరిగిన సెగ్మెంటలో ఒకటైన కిషన్ గంజిలో కాంగ్రెస్ విజయం సాధించింది.
అత్యంత తొలగింపు జరిగిన నియోజకవర్గాలలో రెండో స్థానంలో ఉన్న చన్ పటియా నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలిచింది. మరోవైపు ఎక్కువ తక్కువ తొలగింపులు జరిగిన ఐదు నియోజకవర్గాల్లో భాజపా గోపాల్గంజ్,పూర్నియా, మోతిహారి, వంటి సెగ్మెంట్లను గెలిచింది. జేడీయూ కుచైకోట్ ను గెలిచింది.తక్కువ తొలగింపు జరిగిన ఐదు నియోజకవర్గాల్లో భాజపా ఎల్జెపి చెరో రెండు చోట్ల గెలిచాయి.
కొత్తగా ఓటర్లను చేర్చిన ఐదు సెగ్మెంట్లలో ఎన్డీఏ నాలుగింటిని గెలిచింది తక్కువగా చేర్చిన సెగ్మెంట్ లోను దాదాపు కలిపి విశ్లేషిస్తే ఏ పక్షానికి పూర్తిస్థాయిలో మొగ్గు ఉన్నట్లు కనిపించడం లేదు.చాలా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్ డి ఏ కు ప్రత్యేక ప్రయోజనం ఏమి కనిపించలేదని విపక్షాలూ గెలిచాయని సీనియర్ రాజకీయ పరిశీలకులు సునీల్ పాండే గారు తెలియజేశారు. అంటే దీనిని బట్టి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పని రుజువైంది.
బీహార్ ఎన్నికల తర్వాత కొద్ది నెలలలో ఎన్నికలు జరగబోతున్న 9 రాష్ట్రాలకు 3 కేంద్రపాలిత ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటర్ల లిస్టును సరి చేస్తున్నారు.
కానీ పశ్చిమబెంగాల్లో వార్తలను బట్టి చూస్తే 1 కోటి ఓట్ల వరకు బంగ్లాదేశ్ కు చెందిన ఓట్లు, రోహింగ్యాల ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, ఇండ్లు మారిపోయిన వారి ఓట్లు రెండు మూడు చోట్ల ఒకే వ్యక్తికి ఓట్లు ఉన్నట్టుగా ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.
ఈ గణాంకాలు తెలుసుకున్న మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్ నియమించిన బిఎల్ఓ లకు సహకరించకుండా తను ఇష్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడడం, ఎన్నికల కమిషన్ తూలనాడడం, అనవసరంగా సుప్రీంకోర్టులో కేసులు వేయడం చేస్తున్నారు.
ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 2002 వ సంవత్సరం నుండి ఈరోజు వరకు 2260 బూతులలో ఒక్కరు కూడా చనిపోయిన వారు కానీ, ఇండ్లు మారిన వారు కానీ లేరని కేంద్ర ఎన్నికల కమిషన్కు అబద్దాలు చెప్తున్నారు. అంటే 2002 లో 80 సంవత్సరములు ఉన్న వ్యక్తి చనిపోడా!ఎక్కడైనా జరుగుతుందా! దీనిని బట్టి ఆమె నిజాయితీ ఎంతో ప్రజలకు అర్థమవుతుంది.
తమిళనాడు రాష్ట్రం విషయానికొస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో ఇప్పుడు సర్ అమలు చేయడం సాధ్యం కాదని కుంటి సాకులు చెబుతున్నారు అవేమిటంటే నవంబర్, డిసెంబర్ మాసాలలో వర్షాలు పడతాయని, డిసెంబర్ మాసంలో క్రిస్టమస్ వస్తుందని, జనవరి మాసంలో పొంగల్ వస్తుందని మా రాష్ట్రానికి వీలు కాదని చెబుతున్నారు.
కేరళ రాష్ట్రంలో అయితే మాకు స్థానికంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు వీలు కాదు అని ఎన్నికల కమిషన్కు తెలియజేశారు.
మిగతా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నికల కమిషన్ నియమించిన సర్ ను స్వాగతించి అమలు చేస్తున్నారు.
భారతీయ ఎన్నికల కమిషన్ అనేది రాజకీయాలకు సంబంధం లేకుండా అటానమస్ గా భారత రాష్ట్రపతి అధిపతిగా పనిచేస్తున్న సంస్థ. దానికి అత్యుత్తమ అధికారాలు ఉన్నాయి.
భారతదేశం అన్ని రంగాలలో స్వయం ప్రతిపత్తి సాధిస్తూ ప్రపంచ దేశాల చేత శభాష్ అనిపించుకుంటున్న తరుణంలో ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్న వారి పోకడ, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహార శైలి దేశ ప్రజలు ఈసడించుకునే పరిస్థితి . వేచి చూద్దాం ఏం జరగబోతుందో.
– కరణం భాస్కర్
రాష్ట్ర బిజపి సీనియర్ నాయకులు,
7386128877