Suryaa.co.in

Andhra Pradesh

తిరుమలలో అర్ధరాత్రి జరిగిన హత్యపై సిరిపురపు శ్రీధర్ మండిపాటు

-తిరుమలలో అర్ధరాత్రి జరిగిన హత్యపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మండిపాటు

అమరావతి:
ఆంధ్రుల ఆరాధ్య దైవం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి హత్యకు గురి కావడం జరిగింది. పడుకునే స్థలం దగ్గర ఈ హత్య జరగటం చాలా సిగ్గుమాలిన చర్య.. ఇది పూర్తిగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వైఫల్యం కాదా అని చెప్పి సిరిపురపు శ్రీధర్ ప్రశ్నించారు .పూర్వకాలం నుండి తిరుమలలో ఆర్థిక కారణాలతో కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు ఆరోగ్య సమస్యలతో మరణించడం జరిగింది

తప్పితే ఇప్పటివరకు హత్యలు జరగలేదని, ఇదే మొట్టమొదటిసారిగా హత్య జరగటం. టిటిడి చరిత్రలో ప్రధమం అని స్వామివారి వివిధ సేవల పేరుతో కైంకర్యాల పేరుతో భక్తుల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తూ… అన్నదానం పథకం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తూ భక్తులకు కనీస రక్షణ కూడా కల్పించ లేనప్పుడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చైర్మన్ ఎందుకు అక్కడ పనిచేస్తున్నట్లు బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. గత ఎండాకాలం ఎండ వేడిమికి తట్టుకోలేక చాలామంది భక్తులు వడదెబ్బ తగిలి మరణించడం కూడా జరిగింది. ఈ రకంగా భక్తుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి టీటీడీ పాలకవర్గం, అధికారక వర్గం, విజిలెన్స్, పోలీస్ వైఫల్యం కాదా? సిగ్గుతో మీరందరూ తలదించుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా సరే సెక్యూరిటీ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న టీటీడీ భక్తులకు సరైన భద్రత సౌకర్యాలు కల్పించాలని లేనిపక్షంలో భక్తానుగ్రహానికి గురికాక తప్పదని సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరించారు.

LEAVE A RESPONSE