-పల్నాడు జిల్లా పసుమర్రి సమీపంలో ఘటన
-కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు వినతి
పల్నాడు జిల్లా పసుమర్రి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమా దంలో ఆరుగురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసేందుకు వచ్చి తిరుగుప్రయాణంలో వారంతా ట్రావెల్స్ బస్సులో వెళుతుండగా జర్నీ సినిమా తరహాలో టిప్పర్ ఢీకొంది. దాంతో బస్సులో మంట లు చెలరేగాయి. ప్రయాణి కులు ఆర్తనాదాలతో బయటకు దూకారు. అయితే ఐదుగురు ప్రయాణికులు మంటల్లో ఆహుతి అయ్యారు. టిప్పర్ డ్రైవర్ మూర్తి కూడా మృతిచెం దాడు. చినగంజాం మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికుల్లో మరికొందరు గాయపడగా చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లా పసుమర్రి సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు, టిప్పర్ ఢీకొని చిన్నగం జాంకు చెందిన ఆరుగురు మృతిచెందటంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిం చాలని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధితులను ప్రభు త్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మెరుగైన వైద్యం అందించాలి: లోకేష్
పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేష్ కోరారు.