గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో పెనువిషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఆరుగురు మృతి చెందారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు , ఓ గురువు కృష్ణా నదిలో మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఆరుగురూ మృతి చెందారు. మృతదేహాలు స్థానికులు వెలికితీశారు. మృతులు స్థానిక వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. మృతులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లకు చెందిన శివ శర్మ , నితీష్ కుమార్ దీక్షీత్ , హర్షిత్ శుక్లా , అనుషమన్ శుక్లా , సుబ్బం త్రివేది విద్యార్థులుగా గుర్తించారు. ఆరుగురు ఒకే సారి మృతి చెందడంతో వేద పాఠశాలలో విషాద చాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం పై విచారణ చేపట్టారు.