Suryaa.co.in

భగవంతునికి  భక్తులమని చెప్పుకునే అర్హత ఏమిటి?
Devotional

భగవంతునికి భక్తులమని చెప్పుకునే అర్హత ఏమిటి?

ఏ భగవంతుడు ఏమిటి అనేది ముఖ్యం కాదు, భగవంతుడు ఒక్కడే, నామాలు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటే.మానవునిగా జన్మించి, జ్ఞానంతో భగవంతుని చేరుకొని, జీవన్ముక్తులుగా మారడమే మన లక్ష్యం.
“మనలో అధిక సంఖ్యాకులు దైవము నుండి విలువలేని వాటిని పొందటానికి ప్రార్థిస్తుంటారు…”
ప్రాపంచిక సంతోషాలూ, వ్యాధి నివారణలూ, ఉద్యోగాభివృద్ధులు ఇవన్నీ ఆకర్షణీయంగా కనిపించే కాకిబంగారపు నగలు.కానీ దైవము మనకు మోక్షం అందించుటకు సంకల్పించాడు, అయితే దానిని కోరువారు మనలో కొద్దిమంది మాత్రమే.దైవమును మనల్ని రక్షించే వస్తువును అడిగి అందుకోవాలి తప్ప మనలను బంధించే విషయాలు కోరుకోకూడదు.ఒక వెయ్యి ప్రాపంచిక విషయాల కోసం దేవుని అడుగుతుంటాము తప్ప తనను కావాలని అడిగేవారు చాలా అరుదు.
ఇలాంటివారు ఏనాటికీ భక్తులు కాలేరు!. భగవంతుని తప్ప ఇంక దేనినీ కోరనివాడే నిజమైన భక్తుడు.
మేము సాయిభక్తులమనీ, రామభక్తులమనీ, కృష్ణభక్తులమనీ మనకు మనము చెప్పుకుంటున్నాము కానీ ఆయన కూడా మనల్ని తన భక్తులుగా అంగీకరించాలి కదా!ఎప్పుడు స్వీకరిస్తాడు?మనము భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులమై ఆయన యొక్క ఉపకరణాలుగా అయితే తప్ప మనము తన భక్తులమని చెప్పుకొనే అర్హత మనకు లేదు.

– శ్రీ సద్గురు పీఠం కోటకదిర

LEAVE A RESPONSE