Suryaa.co.in

Andhra Pradesh

2017 లోనే స్కిల్ కేసు

స్పష్టం చేస్తున్న కేంద్ర జీఎస్టీ డీజీ లేఖ
చంద్రబాబుకు 17-ఏ వర్తించదని నిపుణులు స్పష్టీకరణ
ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి కుంభకోణానికి సంబందించి 2017 లోనే కేసు నమోదు, దర్యాప్తు మొదలయ్యాయని, ఈ విషయమై కేంద్ర జీఎస్టీ డీజీ అప్పట్లో రాసిన లేఖ స్పష్టం చేస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన సోమవారం ఈ విషయంపై స్పందించారు. అవినీతి విషయమై అప్పట్లో రాష్ట్రానికి సమాచారం ఇచ్చినా, అధికారంలో ఉన్న టీడీపీ కేసును తొక్కిపెట్టిందని అన్నారు. పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారని, అలాగే చంద్రబాబుకు 17-ఏ వర్తించదని నిపుణులు స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పరుగులు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్రంలో పెట్టుబడుల పరుగు కొనసాగుతోందని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మరో రూ.1624 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని అన్నారు. విశాఖలో సోమవారం సీఎం జగన్ చేతుల మీదుగా 1000 సీటింగ్ సామర్థ్యంతో ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభమయ్యిందని అన్నారు. భవిష్యత్ లో ఇన్ఫోసిస్ రాష్ట్రంలో మరింతగా విస్తరించే అవకాశం ఉందని అలాగే విశాఖలో ఈ సంస్థ ప్రారంభం రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊపందిస్తుందని అన్నారు.

2036 లో ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సన్నాహాలు
ఇండియాలో 2036 లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం భారత ప్రజలను గర్వపడేలా చేసిందని విజయసాయి రెడ్డి అన్నారు. ఏసియన్ గేమ్స్ లో ఇండియా సాధించిన 107 మెడల్స్ ద్వారా స్పోర్ట్స్ లో భారతదేశ సత్తా ప్రపంచానికి చాటి చెప్పిందని అలాగే ఒలింపిక్స్ నిర్వహించడం ఎంతో ప్రేరణ కలిగిస్తుందని ఆయన అన్నారు.

కేంద్ర హౌసింగ్ మంత్రితో విజయసాయి రెడ్డి భేటీ
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తో న్యూఢిల్లీలో ఆయన కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో గృహ నిర్మాణానికి సంబంధించి అమలవుతున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, బీఎల్సీ (బెనిఫిషియరీ లెడ్- కన్స్ట్రక్షన్), ఏ హెచ్ పీ (అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్ షిప్) మొదలగు పథకాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు మంత్రినిదుశ్శాలువతో సత్కరించారు. అనంతరం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

LEAVE A RESPONSE