Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి బినామీలకు రూ.4592 కోట్ల విలువైన స్మార్ట్ మీటర్ల పనులు

-అవినాష్ రెడ్డి బినామీ నర్రెడ్డి ఈశ్వేశ్వర్ రెడ్డికి చెందిన షిరిడీసాయికి రూ.2,535.66 కోట్లు
-ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు రూ.2056.95 కోట్ల పనులు
-రూ.1600 కోట్ల విలువ గల భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణ కాంట్రాక్టు సైతం రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు
విద్యుత్ ప్రాజెక్టులు అస్మదీయులకు కట్టబెట్టేందుకు అంచనాలు పెంచి ఆ భారాలు వినియోగదారులపై మోపుతున్నారు
-విద్యుత్‌శాఖను జగన్ రెడ్డి తన కమీషన్ల అడ్డాగా మార్చుకున్నారు
-టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ కమిటీ వేసి నిగ్గుతేలుస్తాం
– విద్యుత్‌శాఖ మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు

జగన్‌రెడ్డి ప్రభుత్వం తన అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెడుతూ, అంచనాలను భారీగా పెంచి ఆ భారాలను విద్యుత్ వినియోగదారులపై మోపుతోంది. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై గత నాలుగేళ్లలో రూ.57 వేల కోట్లు భారాలు మోపిన జగన్ రెడ్డి ప్రభుత్వం చివరి ఏడాదిలో సైతం ఆ భారాలను మరింత పెంచే పనిలో పడింది. విద్యుత్ పరికరాల కొనుగోళ్ల నుంచి విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల వరకు జగన్ రెడ్డి తన సన్నిహితులకే కట్టబెడుతున్నారు.
ఇటీవల సదరన్, సెంట్రల్ డిస్కంల పరిధిలో రూ.4592 కోట్ల విలువైన స్మార్ట్ మీటర్ల టెండర్లను జగన్ రెడ్డి తన బినామీలకు అప్పగించారు. అవినాష్ రెడ్డి బినామీ నర్రెడ్డి ఈశ్వేశ్వర్ రెడ్డికి చెందిన షిరిడీసాయికి రూ.2,535.66 కోట్లు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు రూ.2056.95 కోట్ల పనులు అప్పగించారు.
గతంలో సైతం రాఘవ కన్‌కస్ట్రక్షన్‌కు చిన్నతరహా పరిశ్రమల సీనరేజీ వసూళ్లు, దవళేశ్వరం కాటన్ బ్యారేజీ పూడిక తీత, నీటిపారుదలకు సంబంధించి మరో రెండు కాంట్రాక్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రూ.1600 కోట్ల విలువ గల భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణ కాంట్రాక్టు సైతం రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు అప్పగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యుత్‌శాఖలో దాదాపు 30 శాతం అంచనాలు పెంచి కాంట్రాక్టులు కట్టబెట్టడంతో విద్యుత్ నిపుణులే విస్మయానికి గురౌతున్నారు.
జగన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ శాఖను తన కమీషన్ల అడ్డాగా మార్చుకున్నారు. అర్హతలు ఉన్నా లేకున్నా పనులు అప్పగించడం వల్ల పనుల్లో నాణ్యత లోపిస్తుంది. దీని వల్ల నిధులు నిరుపయోగంగా మారడమే కాకుండా ప్రాణ నష్టం కూడా వాటల్లే ప్రమాదం ఉంది. అస్మదీయ కంపెనీలకు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలను మార్చేస్తారా? జగన్ రెడ్డి ప్రభుత్వంలో టెండర్లు వేసినా తమకు రావని అర్హులైన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
వచ్చిన కొద్దిమందిని కూడా సాంకేతిక లోపాలు కారణాలు చూపి తొలగిస్తున్నారు. అలాంటప్పుడు టెండర్లకు బిడ్డర్లను ఎందుకు ఆహ్వానిస్తున్నారు? మీ కమీషన్ల కక్కుర్తి కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తారా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీ వేసి నిగ్గుతేలుస్తాం.

LEAVE A RESPONSE