జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మంత్రి, ఎమ్మెల్యేలతోపాటు కలిసి పర్యటించారు..గట్టు మండలం సస్యశ్యామలం చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం.ప్రాజెక్టు పనులను పరిశీలించి త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గద్వాల ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులు రిజర్వాయర్లను పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ సెంటర్ ల గురించి కూడా పురోగతి జరిగిన విధానం, ప్రాజెక్టులోని ప్రధాన సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందని అధికారుల నిర్లక్ష్యం పై తీవ్రంగా మండిపడ్డ స్మితా సబర్వాల్,అధికారుల పనితీరుపై రోజువారీ నివేదికలు ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
ర్యాలంపాడు రిజర్వాయర్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని కోరుతూ…ఆర్ అండ్ ఆర్ సెంటర్ లను పూర్తిగా నిర్మాణం చేసి పెండింగ్లో ఉన్న గ్రామాలలోని పనులను వెంటనే పూర్తి చేయాలని గ్రామంలో పూర్తి చేసి ఆ గ్రామంలో అన్ని సదుపాయాలు కల్పించి మరే గ్రామంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులను సౌకర్యాలను కల్పించాలని సూచించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గద్వాల ప్రాంతం నడిగడ్డ ఇటు కర్ణాటక,అటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు ఇక్కడి తరలివచ్చి పనులు చేస్తున్నారన్నారు.తెరాస ప్రభుత్వంలో ఈ ప్రాంతం సస్యశ్యామలం గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయిస్తామన్నారు. మధ్యలో వదిలేసిన పనులను వేరే గుత్తేదారునాకు అప్పజెప్పి పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సిఎంఓడి అధికారి, మంత్రి హామీ ఇచ్చారు.త్వరలో మరో గోదావరిని తలపించేలా ఈ ప్రాంతాన్ని తీర్చిద్దుతామన్న విశ్వాసంతో కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.45 రోజుల్లో ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నోనిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు.
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని పూర్తి విశ్వాసంతో గద్వాల నియోజకవర్గం చిన్నోనిపల్లి రిజర్వాయర్ ర్యాలంపాడు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిచేయాలని లక్ష్యంతో అడుగులు వేయడం జరుగుతుంది,ప్రాజెక్టులోని సమస్యలను ప్రతి రైతుకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విధంగా చేయడం జరుగుతుంది, రైతులు ఎవరు కూడా అదే అధైర్య పడకండి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ఆర్ అండ్ ఆర్ సెంటర్ కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేక చొరవతో ఆ గ్రామాల్లో కూడా పూర్వ వైభోగం ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,జిల్లా అడిషనల్ కలెక్టర్ రఘురాం శర్మ, అదనపు కలెక్టర్ శ్రీ హర్ష ఎంపీపీ లు,జడ్పీటీసీలు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సింగల్ విండో డైరెక్టర్స్, అధికారులు తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.