Suryaa.co.in

Andhra Pradesh

మహిళలపై సోషల్ మీడియా అరాచకాలకు ముగింపు పలకాలి

– సీఎం కుటుంబ మహిళలపై నీచమైన పోస్టింగ్లు పెట్టిన శ్వేతా చౌదరికి చంద్రబాబు మద్దతా..?
– సోషల్ మీడియాను సంస్కరిద్దాం, జులై 5న మహిళా కమిషన్ సెమినార్- కార్యచరణ

సచివాలయం పబ్లిసిటీ సెల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ సోషల్ మీడియా యుగం అని గొప్పలు చెబుతున్నాం కానీ రాతియుగం రోజుల్లో కూడా లేని హీనత్వాన్ని ఇదే సోషల్ మీడియా మహిళలపై చూపుతుంది. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా పోస్టింగులు, ట్రోల్ చేస్తున్నారు.

సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియా పైత్యాన్ని సమాజం భరించలేకపోతుంది. ప్రధానంగా రాజకీయాల్లో ఉండే మహిళలు, సినీ ఆర్టిస్టులు, మీడియా జర్నలిస్టుల పట్ల ఉన్మాదముగా ప్రవర్తిస్తున్నారు. వారి అభిప్రాయాలపై రాజకీయ దాడిని వదిలేసి అబద్ధాలు, అక్రమ సంబంధాలు అశ్లీల పోస్టింగ్లతో వాళ్లను చంపాలని చూస్తున్నారు.

భ్రూణ హత్యలు, వరకట్నం హత్యలు, యాసిడ్ దాడుల్లాగా ఇప్పుడు సోషల్ మీడియా హత్యలు…మహిళలపై సోషల్ మీడియా వికృత దాడులకు కొంతమంది మహిళలే సిద్ధపడటం చూస్తే రాక్షస సంతానంలో కూడా ఇటువంటివారు లేరు కదా అనిపిస్తుంది… శ్వేతా చౌదరిని చంద్రబాబు ఎలా సమర్థిస్తారు.

ఉదాహరణకు శ్వేతా చౌదరి, ఈమె స్వాతి రెడ్డి పేరుతో సీఎం జగన్ కుటుంబ మహిళలపై భరించలేని, చెప్పలేని పోస్టింగులు పెట్టారు. ట్రోల్ చేశారు. ఆమె ఉండేది ఆధునిక దేశం యూకే లో బుద్ధి మాత్రం పాతాళంలో. చివరకు ఏం జరిగింది..? ఆమె అదే సోషల్ మీడియా బాధితురాలిగా బాధపడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీకు చెందిన శ్వేతా చౌదరిని చంద్రబాబు సమర్ధించారు. మద్దతు ఇచ్చారు.

చంద్రబాబు ఇలాంటి జుగుప్సాకర యుద్ధాలకు కాలు దువ్వే వారిని సమర్థించటం ఎటువంటి సంకేతాలను ఇస్తుంది. శ్వేతా చౌదరి పెట్టిన పోస్టింగులకు గడ్డి పెట్టవలసింది పోయి ప్రోత్సహించడం ఏమిటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా మహిళా కమిషన్ కూడా ఆమెకు మద్దతు పలకాలట……
న్యాయ, పోలీస్ వ్యవస్థలో రివ్యూ జరగాలి.

మహిళలపై హీనాతి హీనమైన పోస్టింగ్లు పెట్టినప్పుడు వాటిపై కఠిన చర్యలు ఉండాలి, సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు ఉండరాదని న్యాయస్థానాలు చెబుతున్నాయని పోలీసులు అంటున్నారు. చట్టపరమైన చర్యలు లేకపోవడంతో ఇరువైపులా మోహరించి దారుణమైన పోస్టులతో యుద్ధాలు చేస్తున్నారు. బలవుతుంది మహిళలే..

లకారాలు, ముకారాల తిట్లు, అక్రమ సంబంధాల గాలి కథలు, నీచమైన ట్రోలింగ్ లు ఇవి ప్రమాదకరమైన నేరాలు కావా…?
వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టలేమా..? అదుపు తప్పుతున్న సోషల్ మీడియాను కట్టడి చేయలేమా..? దీనిపై అందరం మాట్లాడదాం. అవసరమైన సూచనలు అన్ని వ్యవస్థలకు చేద్దాం…ఇందుకోసం రాష్ట్ర మహిళా కమిషన్ జూలై 5 బుధవారం విజయవాడలో ఒక సెమినార్ ను నిర్వహించి కార్యచరణ రూపొందిస్తుంది.

LEAVE A RESPONSE