ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడ్డారు..!
పార్టీ నాయకుల సంగతి పక్కన పెడితే…మీ పని తీరుని ఎవరూ తప్పు పట్టలేము..!
ప్రకృతి విధ్వంసాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నారు..!
నేనున్నానంటూ నిలిచారు..!
మీ వెనుక మేము లేమని చెప్పాము..!
రెవెన్యూ లోటు తో వచ్చారు..!
ఉద్యోగులందరి కోరికలు తీర్చారు..!
టైమ్ ప్రకారం పనిచేయమన్నారు..వాళ్ళకది ఇష్టం లేదు..!
పెన్షన్లు పెంచారు…పసుపుకుంకుమ ఇచ్చారు..!
మీ జేబులోది కాదని వాళ్ళన్నారు..!
ఎవరిచ్చినా వాళ్ళ బాబు సొమ్మేమి ఇవ్వరు కదండీ ..!
తిని ఊసాము..!
ఇళ్లు కట్టించారు…శుభ్రంగా తన్ని పెట్డుకు తొంగుని నిన్ను వేధిస్తుంటే.. అవమానిస్తుంటే..వేరుశనగపప్పు తింటూ చూసాము.
ఇంకా ఇంకా నిన్ను మిఠాయి లాగ వాడుకున్నాము
కరివేపాకు లాగ తీసేసాము..!
మా దూల తీరిపోద్దని తెలిసీ తెలియక ఒక్కసారి …అనుకున్నాము..!
మీ కూడా ఉన్నవాళ్ళు…కొందరు మిమ్మల్ని విడిచి వెళ్ళారు !
మొదట్లోనే అనిపించింది…ఈయన యవ్వారం చూసినప్పుడు.. !
ఏదో ఒక రోజు
వాళ్ళతో సహా మేమందరం గుక్క పట్టి ఏడ్చే కాలం వచ్చేస్తుందనిపించింది..!
అన్ని రకాలుగా ..అందరికీ మడతడి పోయింది..!
ఇంకా మడతడిపోతుంది..!
ఆ సమయం వచ్చేసింది..!
అందుకే మీ కోసం ఎదురు చూపులు!