– ఇప్పటికే నా మీద అనేక కేసులు పెట్టించావ్…రౌడీషీటు కూడా ఓపెన్ చేయించి కోరిక తీర్చుకో
– రెండున్నరేళ్లుగా నువ్వు చేస్తున్న ప్రతి పాపానికీ మూల్యం చెల్లించుకోక తప్పదు
– సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరిక
– వెంకటాచలంలో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వెంకటాచలం : అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలకు నిరసనగా చేపట్టిన దిష్టిబొమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారని కక్షకట్టి మైనార్టీ నేత ఖయ్యూమ్ ఖాన్ దుకాణాన్ని రాత్రికి రాత్రి అధికారులతో కూల్చివేశారు. ఉదయం నిరసన కార్యక్రమం లో పాల్గొన్నందుకు సాయంత్రానికి పోలీసుల సహకారంతో ఖయ్యూమ్ దుకాణాన్ని ధ్వంసం చేశారు. కనీసం దుకాణం లోని వస్తువులు కూడా తీయనీయకుండా పైశాచిక ఆనందం పొందారు.
ఎన్నో ఏళ్లుగా ఖయ్యూమ్ ఖాన్ ఆ ప్రాంతంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ మైనార్టీ నేత కుటుంబానికి దినసరి ఆదాయం లేకుండా వారి కుటుంబాన్ని తీవ్రంగా నష్టపరిచారు. నిరసన తెలిపే హక్కు మైనారిటీలకు లేదా..నిరసన తెలిపితేనే ఆస్తులు ధ్వంసం చేస్తావా..ఇంకా ఇలా ఎన్ని పాపాలు మూటగట్టుకుంటావ్…
ఎమ్మెల్యే కాకాణి మాటలు విని అధికారుల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే తర్వాత ఉద్యోగాలను ఎవ్వరు కాపాడలేరు. వెంకటాచలంలో ఖయ్యూమ్ ఖాన్ కు జరిగిన అన్యాయాన్ని అంత తేలిగ్గా వదిలి పెట్టం. నువ్వు మాత్రం మేడలు, మిద్దెలు కట్టుకుని కోట్లు వెనకేసుకోవాలి… పేదలు మాత్రం ఆస్తులు పోగొట్టుకోవాలా.
ఎమ్మెల్యే కాకాణి పనులను వైసీపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు అమరావతి రైతులకు మద్దతు తెలిపినందుకు అక్రమ కేసులు.. ఎన్ని కేసులు పెట్టిస్తున్నారో వాళ్లకే అర్ధం కావడం లేదు. మా పై అక్రమ కేసులు పెట్టించి ఎమ్మెల్యే కాకాని పైచాచిక ఆనందం పొందుతున్నాడు. ప్రజా ప్రతినిధి అంటే పది మందికి మంచి చేసి వారి మనసుల్లో చోటు సంపాదించుకోవాలి..అంతే కాని గెలిచామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను హింసించడం కరెక్ట్ కాదు.