Suryaa.co.in

Andhra Pradesh

మీ బిడ్డ మీబిడ్డ అంటూనే ప్రజల బుడ్డ ముంచావ్

– జగన్‌పై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

అమరావతి: దుర్యోధనుడికి లోకంలో మంచి కనపడదు. ధర్మరాజుకు చెడు కనిపించదు. ఈ రోజు ఏపీలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐదేళ్లూ మద్యం డిస్టలరీలను చేతిలో పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా నాయకుడు చంద్రబాబు నాయుడి కేమో అది చేతగాకపోయే.

అందుకే కదా లాటరీ పెట్టి పారదర్శకంగా షాపులు కేటాయించి నిన్నటికి రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.5 వేలకు కోట్లకు ఆదాయం తెచ్చారు జగనన్నా…మీరేమో మీ జే గ్యాంగ్ బ్రాండ్లను బలవంతంగా జనంపై రుద్దారు. మీ చెత్త బ్రాండ్లతో దేశంలోనే ఏపీ నవ్వులపాలైంది. సీబీఎన్ గారేమో ఎంఎన్సీ కంపెనీలను మార్కెట్ లోకి తెస్తున్నారు. కిల్లీ కొట్టులోనే డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో కరెన్సీ నోట్లతోనూ కొనాలనే షరతు పెట్టి ఏపీని క్యాష్ ఆంధ్రప్రదేశ్ గా మార్చావ్.

48 సీసాలుండే క్రేటుకు రూ.250 నుంచి రూ.350 కమీషన్ తీసుకుని నెలకు 250 కోట్లకు పైగా కంటైనర్లలో లోటస్ పాండ్ అండ్ యల్లహంక ప్యాలెస్ కు తరలించావ్.. పాపం ఢిల్లీలో ఆ కేజ్రీవాల్, సిసోడియా తదితరులంతా అమాయకులు..రూ.100 కోట్ల ఆరోపణలకే నెలల తరబడి జైళ్లలో ఉన్నారు.

మీరేమో ప్రతి నెలా వందల కోట్ల స్కామ్ చేసినా దర్జాగా బయటున్నారు. మొత్తం మీద మీ బిడ్డ మీబిడ్డ అంటూనే ప్రజల బుడ్డ ముంచావ్..కల్తీ మద్యంతో కొన్ని వేల ప్రాణాలు బలితీసుకున్నమీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నటట్టుంది. నీచ రాజకీయాలు ఇకనైనా ఆపు జగనన్నా..

LEAVE A RESPONSE