– వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– చింతలపాళెం, శ్రీరామపురం రైతులతో మాట్లాడి మద్దతు ధర, ఆర్భీకేల పనితీరుపై ఆరా తీసిన సోమిరెడ్డి
– ఆర్భీకేకి తాళం వేసి ఉండడంతో అధికారులపై అసహనం
సోమిరెడ్డి ఏమన్నారంటే…
జిల్లాలోని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండడంతో పంటలు అధిక దిగుబడులు వస్తున్నాయి.నెల్లూరు జిల్లాలో మెదటి పంట 22 లక్షల టన్నులు దిగుబడి వస్తోంది. దురదృష్టం ఏంటంటే పంటకు గిట్టుబాటు ధర లేదు.
2020లో మెదటి పంటకు, రెండో పంటకు, 2021లోనూ మెదటి పంటకు, రెండవ పంటకు ప్రస్తుతం 2022లో మెదటి పంటకు సైతం గిట్టుబాటు ధర దక్కలేదు.ఇప్పటికీ మూడు మెదటి పంటలు, రెండు రెండవపంటలకు రైతులు గిట్టుబాటు ధర కోల్పోయారు.
రైతు భరోసా కేంద్రాల్లో మొత్తం ధాన్యం కొనేస్తామని చెబుతున్నారు.కానీ అక్కడ కొనే దిక్కేలేదు. సివిల్ సప్లయ్స్ అధికారులు రైతుల వద్ద ధ్యానం కొనుగోలు చేసేందుకు అయ్యే అన్ని ఖర్చులు భరిస్తామని కరపత్రాలు కూడా ముద్రించారు.
వాటిలో స్పష్టంగా గోనె సంచులు,హమాలీలు, రవాణా ఖర్చులు భరిస్తామన్నారు. కానీ అలా జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరపాలి.ఆర్భీకేల్లో కొంటామని ప్రభుత్వం పోస్టర్లు వేసి ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ లేకుండా రైతుల గొంతు కోస్తోంది.ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 40 శాతం హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పటికి 30 వేల టన్నులుమాత్రమే కొనుగోలు చేశారు.
పక్క రాష్ట్రమైన తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గింజ మద్దతు ధరకు రైతు దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది.మన రాష్ట్రంలో మాత్రం అలా ఎందుకు జరగడం లేదు ?రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుంటే కుదరదు. కమిటీ వేసి క్షేత్ర స్థాయి విచారణ జరపండి.వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఒక్క నెల్లూరు జిల్లాలోనే రైతులకు 2500 నుంచి 3వేల కోట్లు నష్టం వాటిల్లింది.ఇక రాష్ట్రమంతా ఎన్ని వేల కోట్లు నష్టం వాటిల్లిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి సమస్య చెప్పే దమ్ము ఒక్క ఎమ్మెల్యేకి లేకుండాపోయింది. ఎంత సేపూ భూముల కుంభకోణాలు, గ్రావెల్, ఇసుక మాఫియాలు తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టడం లేదు
రైతుల బాధలు చూస్తుంటే కడుపు మండిపోతోంది.జీర్ణించుకోలేకపోతున్నాం.వారం రోజులు నుంచి గూడూరు, సూళ్లూరు పేట,ఉదయగిరి ప్రాంతాల్లో పర్యటిస్తున్నా… ఎక్కడికి వెళ్లినా పుట్టి 12వేలకే రైతులు తెగనమ్ముకుంటున్నారు.
మద్దతు ధర రూ.16,660 ఉంటే రైతులు 12 వేలకే ధాన్యం ను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.ఎకరాకు పెట్టుబడి 30 వేలు అవుతుంటే ఇక రైతుకు ఏం ఆదాయం లభిస్తుంది.
17 సంవత్సరాల క్రితమే 2005లో పుట్టి ధాన్యం రూ.14 వేల కు అమ్ముకున్నారు. ఈ రోజు 12 వేలకు అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడితే ఇక ప్రభుత్వాలు ఎందుకు ?
ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది.తప్పుడు కేసులు పెట్టేందుకేనా ఎమ్మెల్యేలు, ప్రభుత్వం ఉండేది ?
ఈ కార్యక్రమంలో వెంకటాచలం, తోటపల్లిగూడూరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, తిరుపతి పార్లమెంటరీ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధాకృష్ణమ నాయుడు, సీనియర్ నాయకులు కోదండయ్య నాయుడు, లఘుసాని వెంకయ్య నాయుడు, ప్రభాకర్ నాయుడు, వలిపి మునిస్వామి, షేక్ షరీఫ్, సండి రమేష్, మందల మణి, నలబాలపు వెంకటాద్రి, తదితరులు పాల్గొన్నారు.